ఏపీలో ఎన్నికల వేడిని వైసీపీయే రాజేస్తోంది. నిజానికి ఏణ్ణర్ధం పైగా ఎన్నికలకు టైం ఉండగానే జగన్ దూకుడు చేస్తున్నారు. విషయానికి వస్తే విపక్షాలు ఈ విషయంలో సర్దుకోవాల్సి ఉంది. కానీ వారి కంటే ముందు తాను అన్నట్లుగా జగన్ ఆలోచనలు ఉన్నాయి. ఇప్పటికే వరసబెట్టి జిల్లాల టూర్లు చేస్తున్న జగన్ అక్కడ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ విపక్షలను చీల్చిచెండాడుతున్నారు.
మరో వైపు పార్టీని ప్రక్షాళన చేసే దిశగా ఆయన చర్యలు చెపట్టారు. పనిచేయని పార్టీ అధ్యక్షులను తీసి పక్కన పెట్టారు. అలాగే రీజనల్ కో ఆర్డినేటర్లను కొందరిని తప్పించారు. ఇన్ని చేసిన జగన్ డిసెంబర్ 4న మరోసారి వర్క్ షాప్ ని కూడా ఏర్పాటు చేసి ఎమ్మెల్యేల పనితీరుని వారి ముందు ఉంచబోతున్నారు.
అదలా ఉండగానే ఇపుడు బీసీ నేతలతో ఆయన అత్యవసర మీటింగ్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 26న తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో ఆయన కీలక బీసీ నేతలు మంత్రులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరు కావాలని మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, బూడి ముత్యాలనాయుడు, చెల్లుబోయిన వేణుగోపాల్, గుమ్మలూరి జయరాం, అలాగే ఎమ్మెల్సీ జంగా క్రిష్ణమూర్తి, రాజ్యసభ మెంబర్ మోపిదేవి వెంకటరమణ, కొలుసు పార్ధసారధి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లకు పిలుపులు వెళ్ళాయి.
మరి ఈ సమావేశంలో జగన్ ఏమి చర్చిస్తారు అన్నదే ఆసక్తికరంగా ఉంది. ఏపీలో ఈసారి ఎన్నికల్లో బీసీ ఓట్లే కీలకంగా మారబోతున్నాయి. మరీ ముఖ్యంగా వైసీపీ బీసీ ఓట్లనే నమ్ముకుంది. కాపుల ఓట్లు టీడీపీ జనసేనలతో కలిపి పంచుకోవాల్సి ఉంటుందని, అందువల్ల బీసీ ఓట్లను అత్యధిక శాతం తామే సాధిస్తే వచ్చే ఎన్నికల్లో గెలిచే వీలు ఉంటుంది అని లెక్కలు వేసుకుంటోంది.
దాంతో బీసీ ముఖ్యులతో ఈ సమావేశాన్ని జగన్ ఏర్పాటు చేశారు అని అంటున్నారు. ఇప్పటికే టీడీపీ బీసీ నినాదంతో ముందుకు వెళ్తోంది. తమది బీసీ పార్టీ అని క్లెయిం చేసుకుంటోంది. ఇపుడు ఆ పార్టీకి తోడుగా జనసేన కూడా రంగంలోకి వస్తోంది. జనసేన కూడా కాపులు ప్లస్ బీసీలు అన్న లెక్కలతో ముందుకు సాగుతోంది అని అంటన్నారు.
బీసీల ఖిల్లా అయిన ఉత్తరాంధ్రాలో జనసేన ఫుల్ ఫోకస్ పెట్టేసింది. ఆ పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ అక్కడికి వెళ్ళి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాలతో అలెర్ట్ అయిన జగన్ బీసీలను తమ వైపునే పూర్తి స్థాయిలో ఉంచుకోవడానికి బీసీ ముఖ్యులతో ఈ మీటింగ్ నిర్వహిస్తున్నారు అని చెబుతున్నారు.
బీసీలను వైసీపీ వైపుగా పూర్తి స్థాయిలో ఆకట్టుకోవాలీ అంటే ఏమి చేయాలి అన్న దాని మీదనే ప్రధానంగా చర్చ ఉంటుంది అని అంటున్నారు. ఈ మీటింగ్ తరువాత జగన్ సంచలన ప్రకటన ఏదైనా ఉంటుందా. బీసీల విషయంలో వైసీపీ కొత్త స్టెప్ ఏదైనా తీసుకుంటుందా అన్న ఆసక్తి అయితే ఉంది మరి.చూడాలి ఏమి జరుగుతుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.