తెలుగు రాష్ర్టాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా దసరా సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ పండుగ ప్రాశస్త్యం హిందూ బందువులందరికీ తెలిసిందే. నరకాసురుడి వర్ధంతి సంహారం, చెడుపై మంచి గెలుపనకు నిదర్శనంగా జరుపుకొనే ఈ పండుగ నేపథ్యంలో వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కొత్త కామెంట్ చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా బుధవారం బొబ్బిలిలో భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన బాబు పాలను మహిషాసుర పాలనతో పోలుస్తూ పిట్ట కథ చెప్పారు. అంతేకాకుండా బాబుకు నారాసురుడు అనే పేరును సైతం ఖరారు చేశారు.
రాష్ట్రంలో పాలన మహిషాసురుడు పాలన తలపిస్తోందని ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేర్కొంటూ ఓ కథ చెప్పారు. మహిషాసురుడు ఎక్కడ అడుగుపెడితే అక్కడ చీకటి అవరిస్తుందని, అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం కరువు, తుపాన్‌లతో అల్లాడుతుందని విమర్శించారు. ``బొబ్బిలి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందని ఆరోజుల్లో బొబ్బిలికోటపై అన్యాయంగా యుద్ధం చేశారని పరాయివారితో చేతులు కలిసి వంచనతో తన వారిని చంపివేశారని విజయనగరం అధిపతి విజయరామ గజపతిని తాండ్ర పాపారాయుడు అంతం చేయడం అందరికి తెలిసిందే.. చివరి క్షణల్లో తాండ్ర పాపారాయుడు విజయరామ గజపతిరాజును చంపుతుండగా చివరిగా విజయరామ గజపతి తాండ్రపాపారాయుడిని ప్రలోభపెట్టారని అయినా ఆయన తలొగ్గలేదు`` అని వైఎస్ జగన్ వివరించారు. ధర్మం తప్పితే అంతం తప్పదని చరిత్ర మనకు చెప్పుతుందని జగన్ పేర్కొన్నారు. ``అదే బొబ్బిలి నేలపై నేడున్న రాజకీయాలు చూస్తే ఒక పార్టీ నుంచి గెలిచి. ఇంకో పార్టీలోకి దూకారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే ఫిరాయించిన ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి కట్టబెట్టడం చూస్తున్నాం.బొబ్బిలి వారసులుగా చెప్పుకునేవారికి విలువలు,విశ్వనీయత, ధర్మం, న్యాయం లేకపోతే ప్రజలకు ఎవరికి దగ్గరకి పోవాలి`` అంటూ జంపింగ్ నేతల తీరును జగన్ ఎండగట్టారు.
అభివృద్ధి కోసం పార్టీని మారాం అని చెప్పిన బొబ్బిలి పాలకులు ఏం అభివృద్ధి చేశారో మాకే తెలియదని బొబ్బిలి ప్రజలు అంటున్నారని జగన్ ఎద్దేవా చేశారు. ``అన్నా..అభివృద్ధి ఆ కుటుంబానికి జరిగింది కానీ మాకు జరగలేదన్నా అని బొబ్బిలి ప్రజలు అంటున్నారు. అభివృద్ధి జరగడంలేదని, మంత్రి పదవులు తీసుకుని మాంగనీసు తవ్వకాలు జరుపుతున్నారు` అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అంతా సమస్యలమయం అయిపోతే, అభివృద్ధి జరుగుతుందంటూ స్వార్థంతో వైఎస్ఆర్‌సీపీలో నుంచి టీడీపీకి ఫిరాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగానే జగన్ నారాసురుడు అనే పేరును సూత్రీకరించారు. ``గతంలో మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆయన గురించి తెలుసు. ఆయన మోసం చేయడానికి ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారేవాడు. తనకు చావే లేకుండా ఉండాలని ఒక వరం పొందాడు. దేవతలు అయినా సరే, పురుషులయిన సరే ఎవరి చేతుల్లో కూడా చావులేకుండా ఉండాలని వరం పొందాడు. ఆ వరం పొందిన మహిషాసురుడు రెచ్చిపోయాడు. ప్రజలను నానా హింసలకు గురిచేశాడు. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు పాలన మహిషాసురుడు పాలనను తలపిస్తోంది.అధికారం కోసం ఏ గడ్డి అయిన తినే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. ఏపార్టీతోనైన పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు సిగ్గుపడరు` అనిన్నారు. ఏ వ్యవస్థను మేనేజ్‌చేయడానికి మొహమాటపడడన్నారు. ఎన్ని వందల అబద్దాల హమీలైన ఇస్తారని దుయ్యబట్టారు.. ``దేవుడిచ్చిన శక్తిని దుర్మార్గాలు చేసేందుకు మహిషాసురుడు వాడితే.. మన నారాసురుడు ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రజల్ని పీడిస్తూ.. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ సంతలో పశువులకు కొనుగోలు చేస్తున్నారు. మహిషాసురుడు ఎక్కడ కాలు పెట్టిన అక్కడ చీకటి..నారాసురుడు అధికారంలోకి వస్తే కరువు, తుపానులతో రాష్ట్రం అంతలకూతలం మవుతోందన్నారు. మహిషాసురుడు మహిళలు నన్నేమి చేయలేరని చులకనగా చూసేవాడని,. నారాసురుడు అక్కాచెల్లెమ్మలకు పొదుపు సంఘాల్లో 14 వందల 206 కోట్ల రుణాలను మాఫీ చేస్తానని ఎగొట్టిన ఘనత ఈ నారాసురుడి` అని మండిపడ్డారు.