జగన్ దీక్ష వల్ల వైసీపీకి ఎంత మైలేజి వచ్చిందన్నది పక్కనపెడితే జగన్ కు మాత్రం వ్యక్తిగతంగా కొంత లాభం కలిగిందట. గతంలో మంచి ఫిజిక్ తో కనిపించి జగన్ కొద్దికాలంగా షేప్ అవుట్ అయ్యారు. కాస్త ఒళ్లు చేసి బరువు పెరిగారు. ఇప్పుడు దీక్ష పుణ్యమా అని అధిక బరువు తగ్గి అందంగా మారిపోయారు. దీక్ష వల్ల ఇప్పుడాయన కొంత బరువు తగ్గి మళ్లీ సినిమా హీరోలా స్లిమ్ గా మారిపోయారు.
జగన్ దీక్ష సమయంలో ఆరు రోజుల పాటు ఆహారం తీసుకోలేదు. ఏడో రోజు వేకువజామున దీక్షను భగ్నం చేశారు. దాదాపు వారం రోజులు తిండి లేకపోవడంతో జగన్ బాగా సన్నబడ్డారు. బరువు కూడా తగ్గారు. దీక్ష కారణంగా ఆయన సుమారు 3 కేజీలు తగ్గినట్లు చెబుతున్నారు. అయిదో రోజు వైద్యులు పరీక్ష చేసిన అనంతరం ఆయన ఆరో రోజు నాటికి 500 గ్రాములు తగ్గారు. టోటల్ గా దీక్ష వల్ల ఆయన చెప్పుకోదగ్గ స్థాయిలో బరువు తగ్గారని వైసీపీ వర్గాలు అంటున్నాయి.
కాగా జగన్ దీక్ష అసలు లక్ష్యం ప్రత్యేక హోదా సాధన కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడం. కానీ, పోరాటంలో పస లేక ఆ లక్ష్యానికి ఏమాత్రం చేరువకాలేకపోయారు. దీక్ష వల్ల ప్రత్యేక హోదా అంశం ఏమాత్రం ముందుకు కదలలేదు. కానీ, వ్యక్తిగతంగా మాత్రం జగన్ కు బరువు తగ్గి స్లిమ్ అయ్యే అవకాశం ఏర్పడింది. దీంతో వ్రతం చెడ్డా ఫలితం దక్కింది అనుకుంటున్నారట.