ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఎట్టకేలకు భేటీ ఖరారు అయింది. ఈ మేరకు అమిత్ షా కార్యాలయం నుంచి సీఎంవోకు సమాచారం అందింది. ఈ భేటీపై అటు బీజేపీలో, ఇటు టీడీపీలో రాజకీయ చర్చకు తెరతీసింది. ఈ భేటీలో అమిత్ షా తో ఏపీ సీఎం జగన్ గత ప్రభుత్వం చేసిన భారీ తప్పిదాలను వివరించి చెప్పనున్నారు. అంతే కాదు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన అక్రమాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లాలని గత కొంత కాలంగా ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే జగన్ మోహన్ రెడ్డికి ఎట్టకేలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దర్శన భాగ్యం కల్పించారు. ఈనెల 21న అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇచ్చారని వైసిపి వర్గాల సమాచారం. వాస్తవానికి ఈ నెల 14న అమిత్ షాను జగన్ కలవాల్సి ఉంది. కానీ మహారాష్ట్ర ఎన్నికల కారణంగా అమిత్ షా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో భేటీ వాయిదా పడింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వివరించడంతో పాటు, విభజన చట్టంలోని హామీల అమలుకు అమిత్ షాను జగన్ కోరనున్నారు.
ఏపీ సీఎం జగన్ కేంద్ర హోంమంత్రితో భేటి కాకుండా రాష్ట్రంలోని బీజేపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇంతకు ముందు కూడా జగన్ అమిత్ షాతో భేటీ అయ్యేందుకు ప్రయత్నించగా... అప్పుడు కూడా బీజేపీ నేతలు జగన్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వకూడదని ఫిర్యాదు చేయడంతోనే అమిత్ షా భేటీకి సమయం ఇవ్వలేదని ప్రచారం జరిగింది. కానీ దీనికి తెరదించుతూ అమిత్ షా జగన్‌కు అపాయింట్ మెంట్ ఇవ్వడంతో రాజకీయ వర్గాలో చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ ఇప్పుడు ప్రదానంగా టీడీపీ వర్గాల్లో ఎక్కడ లేని ఆందోళన నెలకొంది.