ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈరోజు పెదకాపవరం గ్రామ శివారులో రొయ్యల చెరువు క్షేత్రాన్ని వైఎస్ జగన్ సందర్శించారు. రొయ్యల చెరువులో చేపలు - రొయ్యలకు మేత వేయడాన్ని స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం జగన్ వల చేత బట్టి స్వయంగా చెరువులో వేశారు. చేపలు, రొయ్యలు ఎలా పట్టాలో తెలుసుకున్నారు. రొయ్యలు - చేపల ధరలు ఎందుకు పడిపోతున్నాయో కారణాలు అడిగి తెలుసుకున్నారు..
ఈ సందర్భంగా చేపల రైతులు వైఎస్ జగన్ కు మొరపెట్టుకున్నారు. వ్యాపారులు సిండికేట్ గా మారి తక్కువ రేటుకు చేపలు, రొయ్యలు కొనుగోలు చేస్తున్నారని వాపోయారు. ఈ సిండికేట్ లో ప్రధాన భాగస్వామి అధికార టీడీపీకి చెందిన నేత చింతమనేని ప్రభాకర్ అని వైఎస్ జగన్ కు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా చేపల రైతులకు జగన్ ధైర్యం చెప్పారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తామని.. రైతులు గిట్టుబాటు ధర వచ్చేవరకు తమ పంటను కోల్డ్ స్టోరేజీలో దాచుకోవచ్చని చెప్పారు. ఆక్వా రైతులకు విద్యుత్ చార్జీలను రూ.4.75 నుంచి రూ.1.50వరకు తగ్గిస్తామని హామీ ఇచ్చారు.