జగన్ వైఎస్సార్ కి రాజకీయ వారసుడు. అని మెచ్చే జనాలు ఓట్లు వేసి 2019 ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిపించారు. ఆయన సగం పాలన పూర్తి చేసుకున్నారు. సంక్షేమం మీద దృష్టి పెడుతున్నారు. దాని మీద జనాల్లో మిశ్రమ స్పందన అయితే ఏ రోజుకు కనిపిస్తోంది. మరో వైపు అభివృద్ధి ఏదని ప్రజల నుంచి గట్టిగానే ప్రశ్నలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఏపీలో జగన్ కి 2019 ఎన్నికలు బాగానే కలసి వచ్చాయి.
అయితే 2024 మాత్రం అలా కాదని మారుతున్న రాజకీయ పరిణామాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఏపీలో ఏ ఒక్క విపక్షం కూడా తటస్థంగా లేదు. జగన్ కి ఎదురుగా నిలిచి ఉంది. పైగా వారంతా చంద్రబాబుతోనే అన్నట్లుగానే పొలిటికల్ సీన్ ఉంది. తిరుపతి రైతుల సభలో అన్ని పార్టీలు ఒకే వేదిక మీదకు రావడాన్ని చూసిన వారంతా ఏపీలో మహా కూటమి మళ్లీ ఏర్పాటు అవుతుందా అని ఆలోచిస్తున్నారు.
ఒక విధంగా ఎన్నికలకు చాలా దూరంగా ఉండగానే జగన్ కి విపక్షాలు పక్కా క్లారిటీ ఇచ్చాయనుకోవాలి. మేమంతా కలసి వస్తున్నాం కాచుకో అని సవాల్ చేస్తున్నట్లుగా కూడా భావించాలి. అయితే జగన్ సంక్షేమ మంత్రాన్నే నమ్ముకున్నారు. మరో రెండున్నరేళ్లలోగా అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఎంతో కొంత చేసినట్లు అనిపించుకోకపోతే మాత్రం ఇబ్బందేనని అంటున్నారు.
ఇక ఒక్క జగన్ని ఎదుర్కొనేందుకు ఇంత మందా అని వైసీపీ నేతలు అంటున్నారు. అదే సమయంలో జగన్ ఎంత బలవంతుడో తిరుపతిలో చేతులు కలిపిన అన్ని పార్టీల నేతలను చూస్తే అర్ధమవుతోందని మంత్రి మేకతోటి సుచరిత అంటున్నారు. సరే ఇవన్నీ తమ పార్టీకి మద్దతుగా మాట్లాడడానికి సరిపోతాయి కానీ రాజకీయ క్షేత్రంలో నిజంగా నిలబడి ఎదుర్కోవడానికి ఈ మాటలు చాలవు.
మరి ఏం చేయాలి అంటే చాలానే అంటున్నారు. ఒక విధంగా నాడు వైఎస్సార్ ని ఢీ కొట్టడానికి చంద్రబాబు 2009 ఎన్నికల్లో మహా కూటమిని ఏర్పాటు చేసి ఉమ్మడి ఏపీలో ఎదుర్కొన్న తీరుని అంతా గుర్తు తెచ్చుకుంటున్నారు. అయితే నాడు వైఎస్సార్ ఈ పోటీలో గెలిచారు. కానీ మెజారిటీ బాగా తగ్గింది. కానీ ఈ మధ్యలో మరో కీలకమైన పరిణామం కూడా జరిగింది. ఆ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా చిరంజీవి ప్రజారాజ్యం ఒంటరిగా బరిలోకి దిగింది.
దాంతో ఓట్ల చీలిక భారీ ఎత్తున జరిగి కాంగ్రెస్ బయటపడింది అని లెక్కలు చెప్పాయి. మరో వైపు ఆ విధంగా ఓట్ల చీలిక తేవడం వెనక కూడా వైఎస్సార్ రాజకీయ వ్యూహం ఉంది అంటారు. మొత్తానికి ఏదైతేమి వైఎస్సార్ మాదిరిగానే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన జగన్ కూడా ఈసారి మహా కూటమికి ఎదుర్కోక తప్పదు. అదే టైమ్ లో ఆయన విపక్ష ఓట్లలో చీలిక తెచ్చే రాజకీయ మంత్రాంగానికి కూడా తెర తీయాల్సి ఉంటుంది. మొత్తానికి 2024 ఎన్నికల్లో మరో మారు వైఎస్సార్ ని జగన్ తలచుకోక తప్పదని అంటున్నారు.