ఏపీలో నిర్మిస్తున్న కొత్త ఎత్తిపోతల పథకమైన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటం తెలిసిందే. జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి తెలిసిందే. ఇప్పటివరకూ ఎలాంటి వివాదం లేకుండా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధం తాజాగా ఏపీ సర్కారు నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకానికి తెలంగాణ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేయటంతో లొల్లి మొదలైందన్న వాదన వినిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ అభ్యంతరాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా స్పందించారని చెబుతున్నారు. తాజాగా తాడేపల్లిలో అధికారులతో భేటీ అయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభ్యంతరాలపై జగన్ రియాక్టు అవుతూ.. ఏపీ సర్కారు నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం ఉద్దేశాన్ని అధికారులకు వివరించినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ జగన్ ఏం చెప్పారు? ఆయన వినిపిస్తున్న వాదన ఏమిటన్న విషయాల్లోకి వెళితే..
- అప్పట్లో దివంగత మహానేత వైఎస్ మానవత్వంతో ఆలోచించటం వల్లే తెలంగాణ ప్రాంతంలోని శ్రీశైలం జలాశయం నుంచి పాలమూరు - రంగారెడ్డి.. దిండి ప్రాజెక్టుల నిర్మాణానికి సన్నద్దతకు వీలైంది. కల్వకుర్తి.. ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టు నిర్మాణంతో తక్కువ నీటిమట్టం ఉన్నప్పుడు కూడా నీళ్లు తరలించుకోగలుగుతున్నారు.
- అందరికి మంచి జరగాలన్న ఉద్దేశంతోనే మహానేత పలుప్రాజెక్టులు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ తనకు కేటాయించిన నీటిని వాడుకోవటానికి.. కరవు పీడిత ప్రాంతమైన రాయలసీమకు నీళ్లు తరలించేందుకు ఒక సదుపాయం ఏర్పాటు చేసుకుంది.
- తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాల్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే.. తాజాగా చేపట్టిన ఎత్తిపోతల పథకం ఏపీకి కేటాయించిన నీళ్లను వాడుకోవటానికి మాత్రమే. సముద్రంలో కలిసే వరద జలాల్ని.. అది కూడా ఏపీకి కేటాయించిన మేరకు నీటిని కరువు పీడిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రాజెక్టు చేపడితే.. తప్పు పట్టటం సరికాదు.
- కొత్తగా నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకంలో భాగంగా వెళ్లేది కేవలం 9వేల క్యూసెక్కుల నీరు మాత్రమే. అది కూడా శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులు వద్ద ఉన్నప్పుడు మాత్రమే. అది కూడా ఏపీకి కేటాయించిన నీళ్ల వాటాలోనే వినియోగించుకునేదే తప్పించి.. మరెవరి వాటాను తీసుకునే ఉద్దేశం లేదు.