పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు పర్యటిస్తున్న ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఈ క్రమంలో ఒకవైపు బాధితుల సమస్యలను ప్రస్తావిస్తూనే...మరోవైపు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహాలన్నింటినీ సిద్ధం చేసుకొని ముందుకు సాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన పోలవరం ముంపు మండలాలు ఎటపాక, కూనవరం, విఆర్‌పురం మండలాల్లో జగన్ పర్యటించారు. అనంతరం వీఆర్‌పురం మండలం రేఖపల్లిలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ... పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కాంట్రాక్టర్లు, సబ్-కాంట్రాక్టర్ల కోసమే నిర్మాణ వ్యయం అంచనాలు విపరీతంగా పెంచేస్తున్నారని విమర్శించారు. రూ.16వేల కోట్ల అంచనా వ్యయంగా నిర్ధారించిన ప్రాజెక్టు వ్యయాన్ని తాజాగా రూ.36వేల కోట్లకు పెంచేశారన్నారు. డీజిల్, పెట్రోలు, ఇసుక, సిమెంటు, స్టీలు ధరలు తగ్గుముఖం పడుతుంటే అంచనా వ్యయం ఎలా పెరుగుతుందని జగన్ సూటిగా నిలదీశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల బంధువు ఒకరు ఈ ప్రాజెక్టుకు సబ్-కాంట్రాక్టరుగా ఉన్నారని, ఇలాంటి వారికి మేలు చేకూర్చడానికే వ్యయం పెంచేస్తున్నారని జగన్ మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టును స్వాగతిస్తున్నామని, అయితే ప్రాజెక్టు కోసం త్యాగాలు చేస్తున్న గిరిజనులకు కచ్చితంగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం భూములివ్వడానికి సిద్ధపడిన వారికి ఒక్కో ప్రాంతంలో ఒక్కోరీతిన పరిహారం ఇవ్వడం అమానుషమని జగన్ వ్యాఖ్యానించారు. అందరికంటే ముందుగా భూములివ్వడానికి అంగీకరించిన వారికి ఎకరాకు రూ.1.5 లక్షలు మాత్రమే పరిహారం చెల్లించారని, కొన్ని ప్రాంతాల్లో రూ.12 లక్షలు, పట్టిసీమ ప్రాంతంలో రూ.19 లక్షలు చెల్లించారని జగన్ వివరించారు. పరిహారంలో ఇంత వ్యత్యాసం దారుణమన్నారు. అవార్డు ఎంక్వైరీ జరిగేటపుడే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని, కొత్త ఆర్ అండ్ ఆర్ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, పద్దెనిమిదేళ్లు నిండిన వారందరికీ కొత్త చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, పట్టిసీమ మాదిరిగానే పోలవరం బాధితులకూ నష్టపరిహారం ఇవ్వాలని బాధితుల తరపున డిమాండ్ చేస్తున్నామని జగన్ స్పష్టంచేశారు. ప్రాజెక్టు నత్తనడకన నడుస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు. కాంట్రాక్టర్లకు మేలుచేయాలనే ధ్యాస తప్ప గిరిజనులకు న్యాయం చేయాలనే ఆలోచనే ముఖ్యమంత్రికి లేదన్నారు."చూస్తూ చూస్తూనే మూడేళ్లు పూర్తవుతున్నాయి. కళ్లు మూసుకుంటే మరో రెండేళ్లు గడిచిపోతాయి.. అప్పుడు అధికారం మనదే.. ఓపిక పట్టండి.. చంద్రబాబు చేయని పనులన్నీ మనం అధికారంలోకొచ్చిన తర్వాత పూర్తి చేసుకోవచ్చు’ అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన వారికి ఎకరానికి సగటున రూ.19 లక్షల వంతున పరిహారం చెల్లిస్తా" అని భరోసా ఇచ్చారు. పోలవరం నిర్వాసితులకు భూమికి భూమి ఇవ్వాల్సిందేనని డిమాండ్‌చేశారు. పోలవరం నిర్వాసితులకు అండగా ఉంటానని, చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని ఈసందర్భంగా జగన్ వారికి హామీయిచ్చారు.
మూడేళ్లుగా చందబ్రాబునాయుడు పరిపాలనలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికే నిర్వాసితుల వద్దకు వచ్చానని జగన్ అన్నారు. ఈ సందర్భంగా పలువురు నిర్వాసితులు జగన్‌తో మాట్లాడుతూ భూమికి భూమి ఇవ్వలేదని, ఇచ్చిన పరిహారంతో ఎక్కడా పది సెంట్ల భూమి కూడా కొనుక్కోలేని దుస్థితి ఉందని వాపోయారు. తన అత్తారి భూముల్లా ప్రజల నుండి లాక్కుంటున్నారని జగన్ ఈసందర్భంగా వ్యాఖ్యానించారు. పోలవరం నిర్వాసితుల్లో నవ్వు వెల్లి విరిసేంత వరకు అండగా ఉండి పోరాటం సాగిస్తానన్నారు. ఆదివాసీల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇది చాలా అమానుషమని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం మొత్తం బహిరంగ మలవిసర్జన రహితంగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఏజెన్సీలోని గిరిజన హాస్టళ్లలో మరుగుదొడ్లు లేక చెంబులతో కొండలపైకి వెళుతున్న విద్యార్థులు కనిపించడంలేదా అని జగన్ ప్రశ్నించారు. ఈసందర్భంగా విఆర్ పురం జడ్పీ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి విద్యార్థిని సుభాషిణి మాట్లాడుతూ తమ పాఠశాలలో 22మంది ఉపాధ్యాయులకుగాను ప్రస్తుతం 8మంది మాత్రమే ఉన్నారని, దీనివల్ల బోధన సక్రమంగా జరగడం లేదని జగన్ దృష్టికి తీసుకొచ్చింది. ముంపు ప్రాంతాలైనా సరే ముంచే వరకూ విద్యనందించాలని కోరింది. జగన్ మాట్లాడుతూ ఈ చిన్నారి ఆవేదన సీఎంకి వినపడి బుద్ధి వస్తుందేమో చూద్దామన్నారు.