మ‌న వెంట ప్ర‌శాంత్ కిషోర్ ఉన్నారుః జ‌గ‌న్‌

Update: 2017-07-09 10:44 GMT
గుంటూరులో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలు రెండో రోజు కొన‌సాగుతున్నాయి. వైసీపీ  ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్ ఆదివారం ప్లీన‌రీ స‌మావేశాల‌కు హాజరయ్యారు. షర్మిల - విజయమ్మ ఇతర నేతలు మాట్లాడిన అనంతరం ప్రశాంత్ కిషోర్‌ ను పార్టీ శ్రేణుల‌కు వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ ప‌రిచ‌యం చేశారు.

రాబోయే ఎన్నికల నేపథ్యంలో పార్టీకి ప్రశాంత్‌ కిషోర్ త‌న వంతు సహకారం అందించబోతున్నార‌ని జ‌గ‌న్ తెలిపారు. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటులో ప్ర‌శాంత్ కిషోర్ కీలకమైన పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందేన‌ని జ‌గ‌న్ అన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీని ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టడంలో ప్రశాంత్‌ కిషోర్‌ క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. అలాగే బిహార్‌లో నితీశ్‌ కుమార్‌ సీఎం గద్దెనెక్కడానికి, పంజాబ్ లో కెప్టెన్‌ అమరీంద్ర సింగ్‌ ముఖ్యమంత్రి కావడం వెనుక‌ కూడా ప్రశాంత్‌ కిషోర్‌ కృషి ఉందన్నారు.

అయితే ఒక్క ఉత్తరప్రదేశ్‌ లో మాత్రం ఎన్నికల ఫలితాలు కొద్దిగా తారుమార‌య్యాయని, అందుకు కారణాలు కూడా అందరికీ తెలుస‌ని  జగన్‌ అన్నారు. ఇప్పుడు ప్రశాంత్‌ కిషోర్‌ వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో ఉంటారని, పార్టీ శ్రేణులకు స‌ల‌హాలు,సూచ‌న‌లు ఇస్తార‌ని ఆయన తెలిపారు. అందరం కలిసికట్టుగా పార్టీ విజయం కోసం శ్రమిద్దామని పిలుపునిచ్చారు. చంద్రబాబు దారుణ‌మైన‌, అన్యాయ‌మైన‌ పాలనను బంగాళాఖాతంలో కలుపుదామన్నారు. అందుకోసం మనమంతా ఏకమవుదామని చెప్పారు.
Tags:    

Similar News