జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో మ‌రో మైలురాయి

Update: 2018-04-29 07:03 GMT
ఏపీ ప్ర‌జ‌ల క‌ష్ట‌న‌ష్టాల్ని.. వారి స‌మ‌స్య‌ల్ని నేరుగా తెలుసుకునేందుకు వీలుగా ఏపీ విప‌క్ష నేత‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట ఆయ‌న చేస్తున్న పాద‌యాత్ర‌లో ఇప్ప‌టికే ప‌లు మైలురాళ్లు దాటారు. ఆదివారం ఉద‌యం ఆయ‌న 1900కిలోమీట‌ర్ల మైలురాయిని అధిగ‌మించారు.

ఏపీలోని చంద్ర‌బాబు స‌ర్కారు వైఫ‌ల్యాల్ని ఎండ‌గ‌ట్టేందుకు.. బాబు స‌ర్కారులో లోపించిన జ‌వాబుదారీత‌నాన్ని ఎత్తి చూపుతున్న జ‌గ‌న్.. త‌న పాద‌యాత్ర సంద‌ర్భంగా ప‌లు త‌ప్పుల్ని ఎత్తి చూపించారు. ప్ర‌స్తుతం కృష్ణా జిల్లా పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గంలోని తాడంకి వ‌ద్ద 1900కిలోమీట‌ర్ల మైలురాయిని అధిగ‌మించిన ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా ఒక మొక్క‌ను నాటి.. పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు నేత‌లు.. అభిమానులు.. పార్టీ కార్య‌క‌ర్త‌లు ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

గ‌త ఏడాది న‌వంబ‌రు 6న క‌డ‌ప‌జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభ‌మైన పాద‌యాత్ర‌.. ఇప్ప‌టికే ప‌లు జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌ను పూర్తి చేసుకొని 1900కిలోమీట‌ర్లు న‌డిచారు. ఎర్ర‌టి ఎండ‌లో.. వ‌ణికించే చ‌లిని ప‌ట్టించుకోకుండా సాగుతున్న పాద‌యాత్ర ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలో సాగ‌నుంది. అనంత‌రం ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలతోపాటు విశాఖ‌.. విజ‌య‌న‌గ‌రం.. శ్రీ‌కాకుళం జిల్లాల్లో చేసే పాద‌యాత్ర‌తో జ‌గ‌న్ సంక‌ల్ప యాత్ర ముగియ‌నుంది.
Tags:    

Similar News