తాజా ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీతో విక్టరీ కొట్టింది. మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లకు పోటీ చేసిన వైసీపీ 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లలో విజయకేతనం ఎగురవేసింది. ఇంతటి భారీ విజయాన్ని దాదాపుగా ఏ ఒక్కరు కూడా ఊహించలేదనే చెప్పాలి. ఈ విజయంలో ఎవరెంత పాత్ర పోషించారో వైసీపీ అధినేత, ఏపీకి నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుసు. పక్కా లెక్కలతో సహా తన విజయానికి కారకులైన వారు ఎవరన్న విషయాన్ని స్ఫురణకు తెచ్చుకుంటున్న జగన్... ఆయా వర్గాలకు వరుసగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ వస్తున్నారు.
ఇలాంటి కృతజ్ఞతల్లో ఇప్పుడు నెటిజన్లకు జగన్ నుంచి అదిరిపోయే గ్రీటింగ్స్ వచ్చాయి. నేటి ఉదయం ట్విట్టర్ వేదికగా నెటిజన్లు తన విజయానికి చేసిన కృషిని ప్రస్తావిస్తూ... వారిని వైసీపీ వారియర్స్ గా అభివర్ణించిన జగన్... వైసీపీ విజయంలో సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటున్న నెటిజన్లు కీలక భూమిక పోషించారని పేర్కొన్నారు. టీడీపీ అనుకూలంగా బాకాలు ఊదిన ఎల్లో మీడియా వాదనలను తుత్తునీయలు చేసిన నెటిజన్లు... వాస్తవాలేమిటో జనాలకు తెలిపే విషయంలో సక్సెస్ అయ్యారని పేర్కొన్నారు. వైసీపీ విజయంలో కీలక భూమిక పోషించిన నెటిజన్లకు తాను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నట్లుగా జగన్ పేర్కొన్నారు. మొత్తంగా తన విజయానికి కృషి చేసిన ఏ ఒక్కరిని కూడా మరిచిపోని జగన్... వారందరికీ వరుసపెట్టి కృతజ్ఞతలు చెబుతూ వస్తున్నారు.
అయితే సోషల్ మీడియా యాక్టివ్ గా ఉన్న ప్రస్తుత తరుణంలో జగన్ నెటిజన్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతూ పోస్ట్ చేసిన ట్వీట్ ఇప్పుడు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. సదరు ట్వీట్ లో జగన్ ఏమన్నారన్న విషయానికి వస్తే... *నేను రాష్ట్ర బాధ్యతలను స్వీకరించటానికి సహకరించిన సోషల్ మీడియా యోధులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం మీరు ఎంతలా కష్టపడ్డారో నాకు తెలుసు. ఎల్లో మీడియా తప్పుడు వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. మీ సహకారాన్ని ఎప్పుడూ ఇలానే కొనసాగిస్తారని ఆశిస్తున్నా* అని జగన్ సదరు ట్వీట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.