మ‌రోసారి జ‌గ‌న్ రివ‌ర్స్ టెండ‌రింగ్ సంచ‌ల‌నం..!

Update: 2019-12-03 16:03 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి - వైసీపీ అధినేత వైఎస్ జగ‌న్‌ మోహ‌న్ రెడ్డి రివర్స్‌ టెండరింగ్ విధానంలో మ‌రోమారు త‌న ముద్ర చాటుకున్నారు. రివ‌ర్స్ టెండ‌రింగ్ విష‌యంలో మరోసారి బిగ్‌ హిట్ సాధించార‌ని అంటున్నారు. స్మార్ట్‌ ఫోన్ల కొనుగోలులో రూ. 83.8 కోట్లు ఆదా అయ్యాయ‌ని తెలుస్తోంది. ఏపీటీఎస్‌ టెండర్లలో భారీగా ప్రజా ధనం ఆదా అయింది. గ్రామ - వార్డు వాలంటీర్ల కోసం 2,64,920 సెల్‌ఫోన్లు కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం ఏపీటీఎస్‌ ద్వారా కొనుగోళ్లు చేయాల‌ని నిర్దేశించుకుంది.

నవంబర్‌ 30న తొలిదశ బిడ్డింగ్‌ తెరిచిన ఏపీటీఎస్ రూ. 317.61 కోట్లు కోట్ చేసి ఎల్‌–1 గా నిలిచిన కంపెనీ దీనిపై ఏపీటీఎస్‌ రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించింది. రూ.233.81 కోట్లకు కోట్‌ చేసి కంపెనీ బిడ్‌ దక్కించుకుంది. తొలి దశ బిడ్డింగ్‌ కన్నా రూ. 83.8 కోట్ల మేర తక్కువకు కంపెనీ కోట్‌ చేసింది. కాగా, కంపెనీ ప‌లు ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్ర‌తిపాద‌న‌ల‌ను స‌మ‌ర్పించింది. సెల్‌ఫోన్‌కు ఒక ఏడాది పాటు వారెంటీ - 3 జీబీ ర్యాం - 32 జీబీ మెమరీ - ఆక్టాకోర్‌ ప్రొసెసర్‌ లతో కూడిన సెల్‌ ఫోన్ లను అందించనుంది. దీంతోపాటు మొబైల్‌ సాఫ్ట్‌ వేర్‌ ను కూడా కంపెనీ నిర్వహించనుంది. మూడేళ్ల పాటు మాస్టర్‌  డేటా మేనేజ్‌ మెంట్ - టైప్‌ ‘‘సి’’ లేదా మైక్రో యూఎస్‌ బీ టూ మైక్రో యూఎస్‌ బీ కన్వెర్టర్ - టెంపర్డ్‌ గ్లాస్ - బాక్‌ కవర్ - రెండు-మూడో సంవత్సరాల్లో కూడా మెయింటినెన్స్ - వాకిన్‌ సపోర్ట్‌ కంపెనీ అందించనుంది.

కాగా, మునుప‌టి ధ‌ర కంటే రివర్స్ టెండరింగ్‌ లో 26.4 శాతం తక్కువకు అదే క‌పంఎనీ టెండ‌ర్ ద‌క్కించుకోవ‌డం, త‌ద్వారా ప్ర‌భుత్వానికి భారీగా రూ. 83.8 కోట్లు ఆదా కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌ర్కారును ప‌లువురు ప్ర‌శంసిస్తూ అదే స‌మ‌యంలో టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు స‌ర్కారులో పెద్ద ఎత్తున నిధుల దుబారా జ‌రిగింద‌నేందుకు ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొంటున్నారు.

   

Tags:    

Similar News