జగన్ మార్క్ నిర్ణయం.. కొత్త పథకం నేటితో షురూ

Update: 2019-10-04 05:05 GMT
తీవ్రమైన ఆర్థిక లోటు.. వరాల్ని అమలు చేసే పరిస్థితులు లేని వేళ.. ఏటికి ఎదరీదినట్లుగా.. మొండిగా వ్యవహరిస్తూ ప్రజలకిచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా అమలు చేసే అరుదైన ముఖ్యమంత్రిగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిలిచిపోవటం ఖాయమంటున్నారు. ఇటీవల గ్రామ సచివాలయ వాలంటీర్లను ఎంపిక చేసి.. నియామక పత్రాల్ని అందజేస్తున్న సంగతి తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. పాదయాత్రసందర్భంగా ఆటో డ్రైవర్ల కష్టాలు చూసి.. ఆటోలు.. ట్యాక్సీలు.. మ్యాక్సీ క్యాబ్ ల ఫిట్ నెస్.. బీమా.. రిపేర్ల కోసం ప్రతి ఏడాది రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని అందించాలన్న విషయాన్ని జగన్ తనకు తానే ప్రకటించారు.

నాడు ఏలూరులో ఇచ్చిన మాటను.. ఈ రోజు (శుక్రవారం) తాను మాట ఇచ్చిన చోటు నుంచే రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకాన్ని షురూ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ వాహనమిత్ర పేరుతో అమలు చేయనున్న ఈ పథకం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మాట ఇవ్వటం చాలామంది చేసే పని. ఇచ్చిన మాటను మర్చిపోకుండా వెంటనే అమల్లోకి తెచ్చేలా నిర్ణయాలు తీసుకోవటం ఒక ఎత్తు అయితే.. మాట ఎక్కడైతే ఇచ్చానో.. సరిగ్గా అదే చోటు నుంచి అమలుకు శ్రీకారం చుట్టటం విశేషంగా చెప్పక తప్పదు.

తాజా పథకం ద్వారా 1,73,531 మంది లబ్థి పొందనున్నారు. ఈ పథకానికి అప్లికేషన్లు పెట్టుకున్న దారిలో దాదాపు రెండు వేలకు మినహా మిగిలిన వారందరిని ఇందులో చర్చారు. లబ్థిదారుల విషయానికి వస్తే బీసీ వర్గాలే అత్యధికంగా ఉండటం ఒక విశేషం. మొత్తం లబ్థిదారుల్లో 79,021 మంది బీసీలే. తర్వాతి స్థానంలో ఎస్సీలు 39,805 మంది ఉండగా.. లబ్థిదారుల్లో మూడో స్థానంలో కాపులు ఉన్నారు. వారి సంఖ్య 20, 357 కాగా.. నాలుగో స్థానంలో ఈబీసీలు ఉన్నారు. వారి సంఖ్య 9,995 కాగా.. ఎస్టీలు 6,452 మంది లబ్థి పొందనున్నారు.

ఇక.. ఈ పథకంలో అత్యధికంగా లబ్థి పొందుతున్న వారిలో ప్రాంతాల వారీగా చూస్తే.. విశాఖ జిల్లా తొలి స్థానంలో నిలవగా.. తర్వాతి స్థానంలో కృష్ణా.. మూడోస్థానంలో తూర్పుగోదావరి జిల్లా నిలిచింది. చివరి స్థానంలో అనంతపురం.. ప్రకాశం.. వైఎస్సార్ కడప జిల్లాలు నిలిచాయి.
Tags:    

Similar News