జగన్ ను చూసేందుకు పోటెత్తుతున్నారే!!

Update: 2016-09-27 09:46 GMT
ప్రకృతి కన్నెర్ర చేసిన వేళ.. తీవ్రంగా నష్టపోయినప్పుడు సగటు జీవి దిగులెంతో చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటి వేళ.. సామాన్యుడిలో ధీమాను పెంచటానికి రాజకీయ అధినేతలు వస్తుంటారు. అలా వచ్చే వారిచ్చే మాట సాయం కొండంత అండగా ఉంటుంది. కానీ.. చేతిలో అధికారం లేకున్నా.. చేయగలిగింది మాట సాయమే అయినా.. నమ్మకం మనిషిని ఎంతగా కదిలిస్తుందన్న విషయం తాజాగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా పర్యటనను చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

మొన్నటి వరకూ పచ్చటి చేలతో కళకళలాడిన వేలాది ఎకరాలు.. ఇప్పుడు ఆ ఆనవాళ్లు అన్నవి లేకుండా నీళ్లతో నిండిపోయిన పరిస్థితి. మొన్నటిదాకా ముఖం చాటేసిన వానమ్మ.. ఉన్నట్లుండి విరుచుకుపడి.. వేలాది ఎకరాల్ని నీటితో కప్పేసిన వేళ.. అన్నదాత కంట్లో కన్నీరు కారే పరిస్థితి. చేతికి రావాల్సిన పంట నీటిపాలు అయిన వేళ.. ఆశల సౌధం కూలిన రైతన్నకు అండగా ఉంటానని.. ఆదుకుంటానని  చెప్పేందుకు భరోసా యాత్రను నిర్వహిస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్.

తాజాగా గుంటూరుజిల్లా పిడుగురాళ్లకు వచ్చిన జగన్.. పలువురు బాధితుల్ని కలుసుకున్నారు. వారిలో ధైర్యాన్ని నింపారు. మరికాసేపట్లో మరిన్ని గ్రామాల్లో వర్షాల కారణంగా దెబ్బ తిన్న రైతుల్ని పలుకరించి వారికి ధైర్యంచెప్పే ప్రయత్నం చేయనున్నారు.  ఓ వైపు నఫ్టం తీవ్రంగా జ‌రిగినా.. జగన్ ను చూసేందుకు అన్న‌దాత‌లు పెద్ద ఎత్తున పోటెత్తటం ఆసక్తికరంగా మారింది. విపత్తు వేదనలో ఉన్న వారంతా జగన్ వచ్చిన వేళ.. వేలాదిగా చుట్టుముట్టటం.. ఆయన చెప్పే మాటల్ని వినేందుకు ఆసక్తిని ప్రదర్శించటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News