ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వారం రోజుల పాటు విదేశీ విహారాన్ని కూడా చేసి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు మరింత విరామంగా గడుపుతున్నట్టుగా ఉన్నారు. ఎన్నికలకు ముందు రెండు సంవత్సరాల పాటు ఎక్కడా రిలాక్సేషన్ లేకుండా జనం మధ్యనే గడిపిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలింగ్ పూర్తి కావడంతో ఫుల్ రిలాక్డ్స్ గా కనిపిస్తున్నారు.
ఒకవైపు రాజకీయ కార్యక్రమాల్లో అడపాదడపా పాల్గొంటూ, మరోవైపు వచ్చిన పెళ్లి పిలుపులకు వెళ్లి వస్తూ.. గడుపుతున్న జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్టుండి ఒక మల్లీప్లెక్స్ లో కనిపించారు. కుటుంబంతో కలిసి అక్కడకు సినిమాకు వచ్చారాయన.
హైదరాబాద్ లో మహేశ్ బాబుకు చెందిన ఏఎంబీ మల్లీప్లెక్స్ లో జగన్ మోహన్ రెడ్డి సపరివారంతో సినిమాను వీక్షించారు. 'అవేంజర్స్ – ఎండ్ గేమ్' సినిమాను జగన్ కుటుంబం వీక్షించింది. ట్రెండింగ్ ఉన్న ఆ క్రేజీ సినిమాను జగన్ సకుటుంబం సపరివారంగా చూశారు. ఉన్నట్టుండి మల్లీప్లెక్స్ లో జగన్ కనిపించే సరికి అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఆ సందర్భంగా క్లిక్ మన్న ఫొటోల్లో ఇది ఒకటి.