ఏపీ ముఖ్యమంత్రి పదవిని అధిరోహించబోతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి థర్డ్ యంగెస్ట్ గా నిలుస్తూ ఉన్నారు. ఇంత వరకూ ఆంధ్రప్రదేశ్ సీఎం పదవిని అధిరోహించిన వారిలో జగన్ మూడో పిన్న వయస్కుడు. ప్రస్తుతం వైఎస్ జగన్ వయసు 46 సంవత్సరాలా ఆరు నెలలు. ఇది వరకూ కేవలం ఇద్దరు మాత్రమే జగన్ కన్నా చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.
వారిలో ఒకరు చంద్రబాబు కావడం గమనార్హం. ఎన్టీఆర్ ను దించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన సమయానికి ఆయన వయసు 45 సంవత్సరాలా ఐదు నెలలట. ఎన్టీఆర్ అల్లుడి హోదాలో చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు.
ఇక ఏపీ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో ముఖ్యమంత్రిగా ఎన్నికైనది మాత్రం దామోదరం సంజీవయ్య. ఆయన కేవలం 38 సంవత్సరాలా 11 నెలల వయసులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు.
తన తండ్రి వైఎస్ తో పోలిస్తే మాత్రం జగన్ చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అవుతున్నారు. సీఎం అయ్యే సమయానికి వైఎస్ వయసు యాభై నాలుగు సంవత్సరాలకు పైనే. జగన్ మాత్రం నలభై ఆరేళ్ల వయసుకే సీఎం అవుతున్నారు.