ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నూటికి నూరు శాతం అమలు చేస్తామని మరోసారి పునరుద్ఘాటించారు వైసీపీ అధినేత జగన్. ఇవాళ ప్రపంచ జల దినోత్సవం. ఈ సందర్భంగా ఏడాది క్రితం నవరత్నాలను ప్రజలకు పరిచయం చేసే సమయంలో చెప్పిన వాగ్దానాలకు మరోసారి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞ కార్యక్రమాన్ని తాను కొనసాగిస్తామని చెప్పారు. అంతేకాకుండా నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా పోలవరం మొదలు పెండింగ్‌లో ఉన్న హంద్రీనీవా - గాలేరునగరి - వెలుగొండ - వంశధార - ఉత్తరాంధ్ర సుజల స్రవంతి.. అన్ని ప్రాజెక్టులను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇదే నా జలయజ్ఞ వాగ్దానమని పేర్కొన్నారు. ఆప్పుడు మాట్లాడిన ఆ వీడియోను ఇప్పుడు ట్విట్టర్ రో మరోసారి పోస్ట్ చేసి..తాను ఇచ్చిన వాగ్దానాల పట్ల ఎంత కృతనిశ్చయంతో ఉన్నానో మరోసారి చెప్పాకనే చెప్పారు జగన్.
ప్రాజెక్టుల పూర్తితోనే రాష్ట్రం సుభిక్షంగా మారుతుందని వైఎస్ నమ్మేవారు. ఇప్పుడు జగన్ కూడా జలయజ్ఞాన్ని పూర్తి చేసేంతవరకు మడమ తిప్పే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇక శుక్రవారం మంచిరోజు కావడంతో.. పులివెందులలో సరిగ్గా మధ్యాహ్నం 1.49 నిమిషాలకు నామినేషన్ వేశారు జగన్. అంతకుముందు సర్వమత ప్రార్థనాలు చేశారు. హిందూ - ముస్లిం - క్రిస్టియన్ పద్ధతుల్లో పెద్దల ఆశిస్తులు తీసుకున్నారు. ఆ తర్వాత తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకుని నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు . ఈ సందర్భంగా జగన్‌కు స్వాగతం చెప్పేందుకు పులివెందులు రోడ్డు జనాలతో కిక్కిరిసి పోయాయి.