వైఎస్ ష‌ర్మిళ దూకుడు!..సూటిగా సుత్తి లేకుండా?

Update: 2019-03-30 14:47 GMT
ఏపీలో ఎన్నిక‌ల ఫీవ‌ర్ ప‌తాక స్థాయికి చేరుకుంద‌నే చెప్పాలి. ఒకే సారి లోక్ స‌భ‌ - అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ‌... ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే... ఏపీలో పొలిటి్క‌ల్‌ గా బాగానే హీట్ పెరిగింద‌ని చెప్పాలి. ఇప్ప‌టికే నామినేష‌న్ల ఘ‌ట్టం పూర్తి కావ‌డంతో టీడీపీ - వైసీపీ లాంటి ప్ర‌ధాన పార్టీల‌తో పాటు ఇత‌ర పార్టీలు కూడా త‌మ‌దైన శైలిలో ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ ఎన్నిక‌ల‌ను అటు అధికార టీడీపీతో పాటు ఇటు విప‌క్ష వైసీపీ కూడా అత్యంత కీల‌కంగా భావిస్తున్న నేప‌థ్యంలో పోలింగ్‌ కు స‌మ‌యం స‌మీపిస్తున్న త‌రుణంలో త‌మ తురుపు ముక్క‌ల‌ను రంగంలోకి దించుతున్నాయి. టీడీపీలో ఇలాంటి తురుపు ముక్క‌లు దాదాపుగా లేవ‌నే చెప్పాలి. అయితే విప‌క్ష వైసీపీకి ఈ కోణంలో చాలానే తురుపు ముక్క‌లు ఉన్నాయ‌నే చెప్పాలి. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫ్యామిలీలో ఆయ‌న‌తో పాటు ప్ర‌తి ఒక్క‌రూ స్టార్ క్యాంపెయిన‌ర్ కిందే లెక్క‌.

జ‌గ‌న్ త‌ల్లి వైఎస్ విజ‌య‌ల‌క్ష్మితో పాటు సోద‌రి వైఎస్ ష‌ర్మిళ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌రు. ఇక జ‌గ‌న్ స‌తీమ‌ణి వైఎస్ భార‌తి కూడా త‌న‌దైన మంత్రాంగం నెర‌ప‌డంలో దిట్టేన‌ని చెప్పాలి. ఇప్ప‌టికే జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో భార‌తి ప్ర‌చారం సాగిస్తుండ‌గా.. రెండు రోజుల క్రితం విజ‌య‌మ్మ‌తో పాటు ష‌ర్మిళ కూడా ప్ర‌చారంలోకి దిగిపోయారు. ఈ క్ర‌మంలో టీడీపీకి మంచి ప‌ట్టున్న ప్రాంతాలుగా భావిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లోకి ఎంట్రీ ఇచ్చేసిన ష‌ర్మిళ‌... టీడీపీ నేత‌ల‌కు భ‌యం గొలిపే విధంగా ప్ర‌చారంలో స‌త్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు. ప్ర‌జ‌ల‌తో ఈజీగానే క‌నెక్ట్ అయ్యేలా త‌న‌దైన మాట‌ తీరుతో సాగుతున్న ష‌ర్మిళ‌... త‌న ప్ర‌సంగంలో ఎక్క‌డ కూడా ఏమాత్రం సుత్తి లేకుండా ముక్కు సూటిగానే మాట్లాడుతూ.... జ‌నానికి ఈజీగానే అర్థ‌మ‌య్యే భాష‌ తోనే స‌త్తా చాటుతున్నారు. త‌న కుటుంబంపై సానుభూతి చూపాల‌న్న మాట‌ను పూర్తిగానే వ‌దిలేసిన ష‌ర్మిళ‌... అస‌లు ఈ ఐదేళ్ల పాల‌న‌లో ఏం జ‌రిగింది? త‌న సోద‌రుడు అధికారంలోకి వ‌స్తే ఏం జ‌రుగుతుంది? అన్న విష‌యాల‌పై చాలా క్లియ‌ర్‌గానే మాట్లాడుతున్న ష‌ర్మిళ‌... జ‌నాన్ని బాగానే ఆక‌ట్టుకుంటున్నారు.

టీడీపీపై దాడి విషయంలో ష‌ర్మిళ త‌న‌దైన మార్కు ప్ర‌సంగంతో జ‌నం దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. అస‌లు టీడీపీకి మ‌రో అవ‌కాశం ఎందుకివ్వాలో చెప్పాలంటూ లాజిక‌ల్ పాయింట్స్ ప్ర‌స్తావిస్తున్న ష‌ర్మిళ‌... గ‌డ‌చిన ఐదేళ్ల‌లో చంద్ర‌బాబు స‌ర్కారు చేసిన ప‌నుల‌ను ప్ర‌స్తావిస్తూ... మ‌రో ఐదే్ళ్లు వారికే అధికార‌మిస్తే.... ఆ ఐదేళ్ల త‌ర్వాత కూడా అమ‌రావ‌తిలో మొండిగోడ‌లే ద‌ర్శ‌న‌మిస్తాయ‌ని చెబుతున్నారు. ఇక  బైబై బాబు.. బైబై ప‌ప్పు అంటూ త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావిస్తున్న ష‌ర్మిళ‌... ఏకంగా త‌న ప్ర‌చార ర‌థంపై అవే మాట‌ల‌ను రాయించుకుని తిరుగుతున్నారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌ రెడ్డి త‌న‌య‌గా... ఇప్ప‌టికే జ‌నంలో ష‌ర్మిళ‌కు మంచి ఇమేజీనే ఉన్న నేపథ్యంలో... మ‌న పొరుగింటి మ‌హిళ‌గా చాలా సింపుల్ ప‌దాల‌తో ప్ర‌సంగిస్తున్న ష‌ర్మిళ జ‌నాన్ని బాగానే ఆక‌ట్టుకుంటున్నార‌ని చెప్పాలి.
Tags:    

Similar News