కొనసాగుతున్న షర్మిల దీక్ష .. ప్రాణం పోయినా నీళ్లు ముట్టను .. !

Update: 2021-04-16 06:47 GMT
తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులని ఆదుకుంటూ , ఉద్యోగ నోటిఫికెషన్స్ విడుదల చేయాలని వైఎస్ షర్మిల లోటస్ పాండ్ వేదికగా చేస్తున్న నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతుంది. మొదటగా షర్మిల ..  మూడు రోజులు పాటు చేయదలచిన  దీక్షకు పోలీసులు ఒక రోజు మాత్రమే అనుమతించిన సంగతి తెలిసిందే. మొదటి రోజు గురువారం ఉదయం ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో షర్మిల దీక్షను ప్రారంభించారు. కాగా, సాయంత్రం ఆమె దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆ తర్వాత నిన్న సాయంత్రం నుంచి లోటస్‌ పాండ్ ‌లోని ఆమె నివాసంలో నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. దీక్షలో కూర్చున్న షర్మిలకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆమె తల్లి విజయమ్మ కూడా కూడా పరీక్షించారు. అయితే షర్మిల మాత్రం ప్రాణం పోయినా మంచినీళ్లు కూడా ముట్టుకోనని.. 72గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.  తెలంగాణ రాష్ట్రంలో జులై 8న పార్టీని ఏర్పాటు చేయబోతున్నానని షర్మిల ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రోజున రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానని వెల్లడించారు.  

ఇదిలా ఉంటే ..  ఇందిరా పార్క్ నుంచి లోటస్ పాండ్ వరకు పాదయాత్ర ప్రారంభించిన వెంటనే పోలీసులు అడ్డుకున్నారు. అయినా కూడా ఆమె పాదయాత్ర కొనసాగించేందుకు  ప్రయత్నించగా పోలీసుల దురుసుప్రవర్తనతో ఆమె ఒక దశలో స్పృహ తప్పి పడిపోయారు. దీంతో షర్మిల చేయికి బలంగా గాయమైంది. ఈ క్రమంలోనే షర్మిల పోలీసులపై తీవ్రంగా అసహనానికి గురయ్యారు. షర్మిలకు గాయం కావడంతో లోటస్‌ పాండ్ ‌కు ప్రత్యేక వైద్య బృందం చేరుకుంది. ఆమెకు పరీక్షలు చేశారు. లోటస్‌ పాండ్‌కు షర్మిల అభిమానులు భారీగా చేరుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ..  పోలీసులు తనను గాయపరిచారని, మరోసారి తనపై చేయిపడితే ఊరుకొనేది లేదని షర్మిల హెచ్చరించారు.
Tags:    

Similar News