వైఎస్ షర్మిల తొలి సంచలన నిర్ణయం

Update: 2021-07-11 09:24 GMT
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల తన కార్యాచరణ మొదలుపెట్టింది. నిరుద్యోగ యువత కోసం తన తొలి అడుగులు వేస్తోంది. కేసీఆర్ సర్కార్ పై పోరుబాట పట్టింది. తెలంగాణలోని నిరుద్యోగ యువతకు వెన్నుదన్నుగా నిలిచేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నడుం బిగించింది.

తెలంగాణలో నీళ్లు, నిధులు పూర్తయిన నిరుద్యోగుల ఆశలు మాత్రం నెరవేరలేదు. ఉద్యోగం లేక నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నయువతకు భరోసా కల్పించేందుకు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నట్లు వైఎస్ షర్మిల పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ తెలిపారు.

హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ టీపీ అడహక్ కమిటీ సభ్యులు పిట్టా రాంరెడ్డి, భూమి రెడ్డి తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగ యువత కోసం ఏప్రిల్ 15 నుంచి 72 గంటల పాటు షర్మిల దీక్ష చేసినా ప్రభుత్వంలో స్పందన రాలేదన్నారు. ఈ క్రమంలోనే ఇక నుంచి నిరుద్యోగుల కోసం ప్రతివారం ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నారు.

కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కురిపించే వరాలు మాని.. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో ఉద్యోగ నోటిఫికేషన్ క్యాలెండర్ వేయాలని.. అప్పటివరకు తాను ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం దీక్ష చేపట్టనున్నట్టు షర్మిల ప్రకటించారు.
Tags:    

Similar News