'అంతన్నాడు.. ఇంతన్నాడే గంగరాజు..' అని సినిమా పాటను ఇప్పుడు షర్మిల నిన్న నిర్వహించిన సభను చూసి కొందరు పాడుకుంటున్నారట.. నిన్న ఖమ్మంలో జరిగిన షర్మిల మీటింగ్ చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉన్నట్టు ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి.
షర్మిల నిర్వహించే సభకు అంతమంది వస్తారు.. ఇంతమంది వస్తారు అని.. అసలు వస్తారో.. రారో అని హైదరాబాద్ నుంచి వెయ్యి కార్లతో దాదాపు ఇక్కడి నుంచే 4-5 వేల మంది వెంట వెళ్లారు. ఇక ఖమ్మంలో చూస్తే ఆ సభకు వచ్చింది చాలా తక్కువ అని అంటున్నారు. హైదరాబాద్ నుంచి పోయిన వారే కాస్త సందడి చేశారని అంటున్నారు. ఖమ్మం సభకు టీఆర్ఎస్ వాళ్లు కొందరు సహకరించారు అని ప్రచారం సాగుతోంది.
అయితే కేసీఆర్ ఉద్యమ సభల్లో తరుచుగా ఒక మాట చెబుతూ ఉంటారు.. 'మన మీటింగులల్లో పల్లీలు అమ్ముకునేంత మంది కూడా ఆ కాంగ్రెస్ వాళ్లకు రాలేదు అని' ప్రత్యర్థి సభలపై కేసీఆర్ ఆడిపోసుకుంటుంటారు. ఇవి జనభాహుల్యంలో చాలా పాపులర్ అయిన డైలాగులు. వాటినే ఇప్పుడు మళ్లీ తెరపైకి తెస్తున్నారు.కేసీఆర్ విమర్శించిన ఆ మాట ఇప్పుడు షర్మిల మీటింగ్ కు ప్రత్యర్థులు అన్వయిస్తున్నారు. షర్మిల మీటింగ్ కు కూడా అంతే మంది వచ్చారని.. కేసీఆర్ మాటలు మరల ఒకసారి వినపడుతున్నాయి అంతా.. అని అంటున్నారు.
మొత్తానికి ఖమ్మంలో ఎన్నో అంచనాలతో షర్మిల సభ పెడితే అనుకున్నంత స్థాయిలో జనాలు రాలేదని.. ఆమె రాజకీయ భవిష్యత్ కష్టమేనని పలువురు విమర్శిస్తున్నారు. మొదటి సభకే ఇంత తక్కువగా జనాలు వస్తే ఇక మిగతా రోజుల్లో షర్మిలకు తెలంగాణలో ప్రజాదరణ ఉంటుందా? ఉండదా? అన్న సందేహాన్ని పలువురు వ్య్తక్తం చేస్తున్నారు.