ష‌ర్మిల‌కు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో డిపాజిట్ కూడా రాదా?!

Update: 2022-04-26 17:30 GMT
తెలంగాణ‌లోనూ రాజ‌న్న రాజ్యం తీసుకువ‌స్తానంటూ.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టిన ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల‌.. గురించి అంద‌రికీ తెలిసిందే. అయితే..ఆమె గురించి మ‌రో వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. వాస్త‌వానికి ష‌ర్మిల త‌న అన్న మీద కోపంతో.. తెలంగాణ‌లో పార్టీ జెండా ఎగ‌రేసింది. సీఎం కావాల‌నా?  లేక నేను ఒక పార్టీ అధ్య‌క్షురాలిని అని అనిపించుకోవ‌డానికా.. ? అనేది చ‌ర్చ‌. ఇక‌, ఏపీలో రాజ్య సీటు ఆశించి న ష‌ర్మిల అన్న‌గారి ద‌గ్గ‌ర భంగ‌ప‌డిన విష‌యం కొన్నాళ్ల కింద‌ట చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీంతో ఆమె తెలంగాణ‌లో అడుగు పెట్టింది.

ఏపీలో టీడీపీకి, తెలంగాణ‌లో టీఆర్ ఎస్‌కి ఆమె ఒక సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్ అయింద‌ట‌. ఏపీలో టీడీపీ ప్ల‌స్ జ‌న‌సేన పార్టీలు ఇద్ద‌రూ క‌లిపి సీఎం మీద సొంత చెల్లెల‌ను మోసం చేశాడు.. అని వాళ్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తెలంగాణ‌లో టీఆర్ ఎస్ నేత‌లు.. ఇప్ప‌టి వ‌ర‌కు ష‌ర్మిల జోలికి పోక‌పోయినా.. తాజాగా.. ఆమె గురించి కీల‌క‌నాయ‌కుడు ఒక టీవీ చానెల్‌లో ఒక కామెంట్ చేశారు. ఆమెకు త‌న అన్న‌పై కోపం ఉంటే.. అక్క‌డ తేల్చుకోవాలికానీ.. ఇక్క‌డ ఏం ప‌ని? అన్నారు. దీనిని ప‌ట్టుకుని.. ష‌ర్మిల‌.. ప్ర‌స్తుతం ఖ‌మ్మంలో పాద‌యాత్ర చేస్తున్నందున‌..అక్క‌డ స‌భ పెట్టి.. కేటీఆర్ పై విమ‌ర్శ‌లు చేసింది.

ఇక‌, ష‌ర్మిల పార్టీ విష‌యానికి వ‌స్తే.. ఆమె పార్టీ పెట్టి దాదాపు మ‌రో రెండు నెల‌ల‌కు ఏడాది అవుతుంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా ఆమె పార్టీలోకి ఒక్క మాజీ ఎమ్మెల్యే కూడా జాయిన్ కాలేదు. ఒక్క మాజీ స‌ర్పంచ్ కూడా చేర‌లేదు. అయినా.. త‌గ్గ‌కుండా.. ఆమె క‌ఠిన‌మైన ఎండ‌ల‌ను కూడా లెక్క‌చేయ‌కుండా పాద‌యాత్ర చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే..రంగారెడ్డి జిల్లా నుంచి న‌ల్ల‌గొండ దాటుకుని ఈ మ‌ధ్య ఖ‌మ్మం జిల్లాలోకి ప్ర‌వేశించారు ష‌ర్మిల‌. అయితే.. ఇప్పుడు కొంత బూమ్ పెరిగింద‌నే టాక్ వినిపిస్తోంది.

గ‌తంలో ప‌ట్టుమ‌ని.. పాతిక మంది కూడా లేని పాద‌యాత్ర‌కు ఇప్పుడు 200 నుంచి 300 మంది వ‌ర‌కు వ‌స్తున్నార‌ని అంటున్నారు. తాజాగా నిర్వ‌హించిన స‌భ‌కు ఈ రేంజ్ లో ప్ర‌జ‌లు వ‌చ్చేస‌రికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయ‌కులు.. దీనిని హైలెట్ చేస్తున్నారు. డిజిట‌ల్ మీడియా ద్వారా.. ఎడిట్ చేసి.. జ‌నాలు వ‌చ్చిన‌ట్టు చూపిస్తున్నార‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. ఇదిలావుంటే.. పార్టీకి పెద్ద‌గా ఫాలోయింగ్ లేక‌పోయినా.. ష‌ర్మిల గురించిన చ‌ర్చ మాత్రం రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగానే సాగుతోంది.

వ‌చ్చే 2023లో ఆమె ఎక్క‌డ నుంచి పోటీ చేస్తున్నారు?  నియోజ‌క‌వ‌ర్గం ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. ఈ క్ర‌మంలో ఒక కీల‌క న‌నియోజ‌క‌వ‌ర్గంలోపై ష‌ర్మిల దృష్టి పెట్టార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. అదే ఖ‌మ్మంలోని పాలేరు నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ నుంచే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె పోటీ చేస్తార‌ని.. చాలా మంది చెబుతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఇక్క‌డ వైఎస్సార్ అభిమానులు ఎక్కువ‌గా ఉన్నార‌ని.. పైగా రెడ్డి సామాజిక వ‌ర్గం కూడా ఇక్క‌డ ఎక్కువ‌గా ఉంద‌ని విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇదిలావుంటే, ఇక్క‌డ ఇటీవ‌ల ఒక స‌ర్వే నిర్వ‌హించారట‌.

గ‌త 2018 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున పాలేరులో గెలిచిన ఉపేంద‌ర్ రెడ్డి.. టీఆర్ ఎస్‌లోకి జంప్ చేశార‌ని, ఉపేంద‌ర్ రెడ్డి - తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు - నాయ‌ల నాగేశ్వ‌ర‌రావు - ష‌ర్మిల మీద స‌ర్వే చేస్తే.. షర్మిల‌కు.. 1.8 % శాతం ఓట్లు వ‌చ్చాయి అని అంటున్నారు. మాకు వైఎస్సార్ మీద అభిమానం ఉంది. కానీ, మేము తెలంగాణ బిడ్డ‌లం.. మాకు ఇక్క‌డ సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయి. ఇక్క‌డ టీఆర్ ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది కానీ.. ష‌ర్మిల పార్టీకి మేం వేయ‌ము అని తేల్చారని.. చ‌ర్చ సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో ష‌ర్మిల త‌న‌ పార్టీతోనే స‌ర్వే చేయించి,.. గెలిచే సీటు ను ఎంచుకుని పోటీ చేస్తే.. ప‌రువు కాపాడుకున్న‌ట్టు ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ప్ర‌స్తుతం పార్టీ ప‌రిస్తితి దారునంగా ఉంది. ఎవ‌రూ కీల‌క నేత‌లు లేరు. ఫైర్ బ్రాండ్లు అంత‌క‌న్నా లేరు. ఈ నేప‌థ్యంలో ష‌ర్మిల గెలిస్తే... కొంత ఊపు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అలా కాకుండా.. ఓడిపోతే.. ఏపీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాదిరిగా పార్టీ త‌యారు అవుతుంది అని.. సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. 
Tags:    

Similar News