వైఎస్ షర్మిల కాన్వాయ్ లో ప్రమాదం

Update: 2021-04-09 07:03 GMT
దివంగత సీఎం వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న సంకల్ప సభకు హైదరాబాద్ నుంచి బయలు దేరారు. ఈ సాయంత్రం ఖమ్మం పెవెలియన్ గ్రౌండ్ లో వైఎస్ఆర్ ఆత్మీయులతో షర్మిల సభ నిర్వహించనుంది.

పంజాగుట్టలో వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన షర్మిల అభిమానులను కలుస్తూ ముందుకు సాగారు.  ఎనిమిది ప్రాంతాల్లో షర్మిలకు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు.

మధ్యాహ్నం సూర్యపేటలో భోజనం చేసిన తర్వాత కూసుమంచి నుంచి ఖమ్మం జిల్లా నేతలు స్వాగతం పలికారు. సంకల్ప సభలో షర్మిలతోపాటు వైఎస్ సతీమణి విజయలక్ష్మీ పాల్గొననున్నారు. తెలంగాణ రాజకీయాల్లో తన పార్టీ పేరు, పాత్ర గురించి షర్మిల ఈ సభలో వివరిస్తారు.

కాగా వైఎస్ షర్మిల కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి సంకల్పసభ కోసం ఖమ్మంకు భారీ కాన్వాయ్ గా ఆమె బయలు దేరారు. మార్గ మధ్యలో 4 వాహనాలు ఒకదాన్ని మరొకటి ఢీకొన్నట్లుగా తెలుస్తోంది. ఎవరికి గాయాలు కాలేదని.. కానీ వాహనాలు దెబ్బతిన్నట్టు సమాచారం. షర్మిలకు ఎలాంటి ప్రమాదాలు కాలేదని తెలుస్తోంది.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News