జగన్ చెప్పిందే షర్మిల చెప్పింది కానీ లాస్ట్ కు..

Update: 2021-04-11 00:30 GMT
‘ఏరు దాటేదాక వీర మల్లన్న.. ఏరు దాటాక బోడ మల్లన్న’ అన్నట్టుగా పార్టీలు వ్యవహరిస్తున్నాయని సాధారణ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం ఆది నుంచి పాటుపడిన వారిని కాదని.. అధికారంలోకి వచ్చాక చేరిన వారికే పదవులు, సీట్లు ఇచ్చి పెద్దపీట వేస్తున్న పార్టీల తీరుపై కార్యకర్తలు రగిలిపోతున్నారు. అటు టీఆర్ఎస్, ఇటు వైసీపీలోనూ అదే కథ జరిగిందని.. ఇప్పుడు కొత్తగా వచ్చిన షర్మిల పార్టీని నమ్మే పరిస్థితి లేదని అంటున్నారు.

‘తమ పార్టీలో నేటి కార్యకర్తలే రేపటి నాయకులు’ అని వైఎస్ షర్మిల చెప్పారు. జగన్ కూడా ఇదే మాట గతంలో చెప్పారు. పది సంవత్సరాలు ప్రతిపక్షంలో కార్యకర్తలను తిప్పుకొని లాస్ట్ కు ఎన్నికల టైంకు సర్వేలు చేసి నమ్మిన కార్యకర్తలకు టికెట్లు ఇవ్వకుండా జగన్ పెడచెవిన పెట్టాడని ఆరోపణలు క్షేత్రస్థాయి నుంచి వస్తున్నాయి. జగన్ ఎన్నికల వ్యూహకర్త పీకే టీం చెప్పిందని.. అందుకే నీకు సీటు ఇవ్వం అని చెప్పి తప్పించుకున్నారని అంటున్నారు. వాళ్ల డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇప్పుడు టికెట్లు, పదవులు దక్కని ఏపీలో వైసీపీ కార్యకర్తలు ఈరోజు ఎలా ఇబ్బంది పడుతున్నారో  అందరికీ తెలుసు అంటున్నారు.

ఈరోజు వైసీపీలో నిజమైన కార్యకర్తలకు ఏమైనా న్యాయం జరుగుతుందా అని వారంతా వాపోతున్నారు. నూటికి 99శాతం న్యాయం జరగడం లేదు అని.. అంతా టీడీపీ నుంచి వచ్చిన వారికే వైసీపీలో అందలం దక్కుతోందని ఆరోపిస్తున్నారు.  వైసీపీ వాళ్లను రోడ్డు మీద పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
ఆరోజు జగన్ మీకు ‘నేను ఉన్నాను.. విన్నాను’ అని చెప్పి ఈరోజు టీడీపీ వాళ్లను చేర్చుకొని కనీసం వైసీపీ వాళ్లకు హైకమాండ్ తో అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదు అని క్షేత్రస్థాయి నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి.    
 
రేపు షర్మిల కూడా ఇదే చేస్తుందని.. అప్పుడు ఈ మాజీ మంత్రియో.. మాజీ ఎమ్మెల్యేనో.. మాజీ ఎంపీనో షర్మిల పార్టీలోకి వస్తే ఇప్పుడు ఉన్న వాళ్లను పక్కన పడేసి ఇప్పుడు వైఎస్ షర్మిల కోసం పాటుపడుతున్న వారిని.. ఖర్చు పెట్టిన వాళ్లను పక్కన పడేసి మాజీలను చేర్చుకుంటారని... ఇప్పుడు షర్మిల మాటలు నమ్మే పరిస్థితి లేదు అని పెద్ద ఎత్తున వైసీపీ, షర్మిల పార్టీని నమ్ముకొని ఉన్నా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పార్టీలను నమ్మి తమ జీవితం ధారపోయమని తెగేసి చెబుతున్నారు.
Tags:    

Similar News