మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్నో మలుపులు చోటు చేసుకుంటున్నాయి. హత్య జరిగింది. దాని వెనక ఉద్దేశ్యాలు ఏంటి అన్న దాని మీదనే నాలుగేళ్ల కాలంగా ఎటూ తేలడంలేదు. ఇక ఈ కేసు ఈ నెల 30తో ఒక కొలిక్కి వస్తుందని అంతా భావిస్తున్న వేళ రంగంలోకి వివేకా రెండవ భార్యగా చెప్పుకునే షేక్ షమీం రంగంలోకి దిగారు.
ఆమె సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్ లో అనేక కొత్త కోణాలు ఈ కేసులో కనిపిస్తున్నారు. వివేకా తనను రెండవ వివాహం చేసుకున్నారని, అయితే వివేకాను కలవనీయకుండా తనను ఆయన బావమరిది నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రయత్నాలు చేశారని, తనని అనేక సార్లు బెదిరించారని కూడా ఆమె సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది.
అంతే కాదు వివేకా చనిపోయే ముందు తనతో మాట్లాడారు అని ఆమె చెప్పింది. ఎనిమిది కోట్ల బెంగుళూరు డీల్ సెట్ అయితే తనకు ఆస్తిగా భూమి కొనిపెడతాను, తమ కుమారుడికి కూడా న్యాయం చేస్తామని చెప్పారని చెప్పుకొచ్చింది. ఇక వివేకా మరణిస్తే కూడా తాను వెళ్లలేకపోవడానికి కారణం శివప్రకాష్ రెడ్డి అని ఆమె ఆరోపించింది. ఆయనకు భయపడీ వెళ్లలేదని ఆరోపించింది.
వివేకా చివరి రోజులలో ఎంతో ఇబ్బంది పడ్డారని, ఆయన చెక్ పవర్ రద్దు చేశారని ఆమె చెప్పడంతో ఈ కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇక పదే పదే ఆమె వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి మీద బావమరిది శివ ప్రకాష్ రెడ్డి మీద చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. అంతే కాదు సునీత కూడా తనను అనేకసార్లు బెదిరించారని కూడా సీబీఐ దృష్టికి తీసుకుని వచ్చారు.
ఇదే స్టేట్మెంట్ లో ఆమె మరో మాట అన్నారు. వివేకా పదవుల మీద బావమరిది శివప్రకాష్ రెడ్డికి కన్ను ఉందని, ఆయన ఆస్తుల మీద అల్లుడు రాజశేఖరరెడ్డికి చూపు ఉందని చెప్పుకొచ్చారు. దీంతో ఇపుడు ఈ ఇద్దరి మీద షేక్ షమీం చేసిన ఆరోపణల నేపధ్యంలో ఈ కేసులఒ సీబీఐ కూడా కొత్త కోణం వైపు చూస్తోంది అని అంటున్నారు
మరో విషయం ఏంటి అంటే ఈ రోజు విచారణకు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పిలవలేదు. అదే విధంగా సీబీఇ ఆఫీసుకు సునీత భర్త అయిన నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి రావడం కూడా విశేషంగా చూస్తున్నారు. ఆయనను సీబీఐ అధికారులే పిలిచారా లేక ఆయనే తానుగా వచ్చారా అన్నది తెలియడంలేదు కానీ ఆయన సీబీఐ ఆఫీసుకు రావడం మాత్రం బిగ్ ట్విస్ట్ గానే చూస్తున్నారు.
మరి ఈ కేసులో వేరే కోణం నుంచి సీబేఇ విచారణ చేస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది. అదే జరిగితే మాత్రం ఈ కేసులో మరిన్ని కొత్త మలుపులు ఉంటాయని అలాగే సంచలనాలు నమోదు అవుతాయని కూడా అంటున్నారు.