దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు శనివారం ఉదయం కడప జిల్లా పులివెందులలో ముగిశాయి. పులివెందుల లోని ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డి ఘాట్ పక్కనే ఉదయం 11 గంటలకు వివేకానందరెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు - సన్నిహితులు - అశేష అభిమానులు అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి పర్యంతం అయ్యారు..
బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. జనం పెద్ద ఎత్తున తరలి వచ్చి కడసారి వీడ్కోలు పలికారు.
అంతకుముందు అశేష జనసందోహం మధ్య వివేకానందారెడ్డి భౌతికకాయాన్ని ఆయన నివాసం నుంచి రాజారెడ్డి ఘాట్ వరకు అంతిమయాత్రను కొనసాగించారు. వేలాది మంది అభిమానులు అశ్రునయనాలతో ఈ యాత్రలో పాల్గొన్నారు. దారుణ హత్య చోటుచేసుకోవడంతో పోలీసులు వైఎస్ జగన్ కు భారీ భద్రత కల్పించారు. జగన్ - వైఎస్ అవినాష్ రెడ్డి - కుటుంబ సభ్యులు అంతిమయాత్రలో పాల్గొని జనానికి అభివాదం చేశారు.
వైఎస్ రాజారెడ్డి అంత్యక్రియలు జరిగిన చోటే ఆయన కొడుకు వివేకానందరెడ్డి అంతిమ సంస్కారాలు చేయడం వైఎస్ అభిమానులను ఉద్వేగానికి గురిచేసింది.