లక్షలాదిమంది నిజమైన ఓటర్ల పేర్లు జాబితాల నుంచి మాయం చేయడం, బోగస్ ఓటర్లను చేర్చడం వగైరా పనులకు అధికార తెలుగుదేశం పార్టీ తెగబడుతోందని ఏపీ ప్రతిపక్ష నేత - వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తం చేసిన ఆందోళన నిజమైంది. న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) పెద్దలను వైఎస్సార్ కాంగ్రెస్ నేతుల ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ప్రమేయంతో బోగస్ ఓట్లు వచ్చిచేరాయని ఫిర్యాదు చేశారు. ఓట్ల తొలగింపు కుట్ర ఎంత భారీగా జరుగుతుందో తాజాగా స్పష్టమైంది. ఏకంగా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలోనే ఓట్ల తొలగింపు ఎత్తుగడ జరిగింది.
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు - మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డికి పులివెందులలోని బాకరాపురంలోని 134వ వార్డులో ఓటు హక్కు ఉంది. అయితే, వివేకానంద రెడ్డి ఓటును తొలగించాలంటూ అధికారులకు దరఖాస్తు అందింది. అత్యంత ఆసక్తికరంగా ఆయనకు తెలియకుండానే ఆన్‌లైన్‌లో ఫారం నంబరు 7ను సమర్పించారు. స్వయంగా వివేకా ఆర్జీ పెట్టుకున్నట్లు ఈ దరఖాస్తు ఉండటం విస్మయకరం. ఈ పరిణామంపై వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.
దొంగ ఓట్ల నమోదు మాత్రమే కాదు - నికార్సయిన ఓటర్లలో తమకు వ్యతిరేకులని నిర్ధారణైనవారి ఓట్లను చడీచప్పుడూ లేకుండా అధికార తెలుగుదేశం పార్టీ నేతలు తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రధానంగా వైసీపీ అధ్యక్షుడి సొంత జిల్లా అయిన కడపను టార్గెట్ చేశారని పేర్కొంటున్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం సహా జిల్లాలోని పది నియోజకవర్గల్లో వైఎస్సార్ సీపీ సానూభూతిపరుల ఓట్లను టార్గెట్ గా చేసుకుని ఆన్ లైన్ లోనే ఓట్ల తొలగింపు కార్యాకలపాలకు ప్రభుత్వం పాల్పడుతోందని మండిపడుతున్నారు.