ప‌వ‌న్ నోట జ‌గ‌న్ డైలాగ్ !

Update: 2022-05-06 04:12 GMT
పెరిగిపోతున్న పెట్రో, డీజిల్ ధ‌ర‌ల‌కు సంబంధించి ఏం మాట్లాడినా వైసీపీ ఒప్పుకోవ‌డం లేదు అని టీడీపీ గ‌గ్గోలు పెడుతోంది. ఏం మాట్లాడినా విన‌కుండా కౌంట‌ర్ ఇచ్చేట‌ప్పుడు త‌మ మాట‌ల‌ను అర్థం చేసుకోకుండా, విప‌క్ష విమ‌ర్శ‌ల‌కు  వ్య‌క్తిగ‌త విమ‌ర్శల‌ను జోడిస్తోంది అన్న‌ది మ‌రో వాద‌న. వైసీపీ మాత్రం ఉన్న‌త పాల‌న ఇస్తున్నామ‌ని ఇప్పుడున్న ప‌న్నులు, ధ‌ర‌లు త‌మ‌కూ బాధ‌నే క‌లిగిస్తున్నాయ‌ని, సంక్షేమ ప‌థ‌కాల అమలుకే తాము ఈ విధంగా చేయాల్సి వ‌స్తోంద‌ని మంత్రులు అంటున్నారు.

మంత్రులే కాదు మాజీలు కూడా ఇదే మాట అంటున్నారు. ఇక ఒక్క‌సారి జ‌న‌సేన ఏం అంటుందో చూద్దాం. జ‌న‌సేన కూడా టీడీపీ మాదిరిగానే ఎప్ప‌టి నుంచో పెరుగుత‌న్న ధ‌ర‌ల నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌నే కోరుతోంది. క‌రోనా నుంచి కోలుకుంటున్న ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌కు ప్ర‌భుత్వాలు చేయూత ఇవ్వాల‌నే విన్న‌విస్తోంది. ఇవేవీ ప‌ట్టించుకోకుండా ప‌వ‌న్ పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌తో దాడి చేస్తోంది వైసీపీ.

ఇక సిస‌లు లెక్క‌లు ఎలా ఉన్నాయో చూద్దాం

పెట్రోలు మూల ధ‌ర 57.95 రూపాయ‌లు
కేంద్ర ఎక్సైజ్ ప‌న్ను 27.90 రూపాయ‌లు
రాష్ట్ర  ప‌న్ను 31.30 రూపాయ‌లు
డీల‌ర్ క‌మిష‌న్ 3.80 రూపాయ‌లు
మొత్తం 120.95
డిజిల్ మూల ధ‌ర 60.10 రూపాయ‌లు
కేంద్ర ఎక్సైజ్ ప‌న్ను 21.80 రూపాయ‌లు
రాష్ట్ర  ప‌న్ను 22.20 రూపాయ‌లు
డీల‌ర్ క‌మిష‌న్ 2.50 రూపాయ‌లు
మొత్తం 106.60 రూపాయ‌లు

ఇప్పుడు కేంద్రం ఏమంటుంది అంటే రాష్ట్రాల త‌మ వాటా ప‌న్ను త‌గ్గించుకుంటే కొంత  కొంత వినియోగ‌దారుడిపై భారం త‌గ్గుతుంది అని ! కానీ వైసీపీ కానీ టీఆర్ఎస్ కానీ అందుకు ఒప్పుకోవడం లేదు. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన కూడా బాదుడే బాదుడు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేందుకు సిద్ధం అవుతోంది. పెరుగుతున్న డీజిల్ ధ‌ర‌ల కార‌ణంగా లారీ యాజ‌మాన్యాలు  త‌మ‌కు సంస్థ‌ల  నిర్వ‌హణ భారంగా ఉంద‌ని గ‌గ్గోలు పెడుతున్నాయి. వీటితో పాటు రెండు వంద‌ల రూపాయ‌లు ఉన్న గ్రీన్ ట్యాక్స్ ఇర‌వై వేలు చేశార‌ని ఆవేద‌న చెందుతున్నారు. ఇవేవీ వైసీపీ ప‌ట్టించుకోక‌పోయినా, ప్ర‌జల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాక‌పోయినా విప‌క్షం ఏమీ అన‌కూడ‌దు అన్న ధోర‌ణిలో మంత్రులు మాట్లాడుతుండ‌డం బాధాక‌రం.

గ‌తం క‌న్నా ఇప్పుడు ధ‌ర‌లు బాగా పెరిగిపోతున్నాయ‌ని, దీంతో పేద ప్ర‌జ‌ల‌కు రోజు గ‌డ‌వ‌డ‌మే క‌ష్టంగా ఉంద‌ని విప‌క్షం గ‌గ్గోలు పెట్టినా, దేశ వ్యాప్తంగా ఉన్న ప‌రిస్థితుల్లో భాగంగానే మ‌న రాష్ట్రం కూడా ఉంద‌ని ఇందులో తాము చేయ‌గ‌లిగింది ఏమీ లేద‌ని రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు లాంటి నాయ‌కులు జ‌గ‌న్ కు బాస‌ట‌గా ఉంటూ, ప్ర‌జ‌ల నుంచి సానుభూతి పొందే ప్ర‌య‌త్నాలేవో చేస్తున్నారు.

ఈ  ద‌శ‌లో జ‌న‌సేన త‌న పోరాటాల‌ను మ‌రింత ముమ్మ‌రం చేయ‌నుంది. టీడీపీ పొత్తు ఉన్నా లేక‌పోయినా స‌రే ! జ‌న క్షేత్రంలో ఉంటూ వైసీపీ స‌ర్కారు విధిస్తున్న అధిక ప‌న్నుల‌పై గ‌ళం వినిపించ‌నుంది. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా వేదిక‌గా యుద్ధం షురూ చేసింది.
Tags:    

Similar News