గడిచిన పదకొండేళ్లలో ఎప్పుడూ లేని రీతిలో దివంగత మహానేత వైఎస్ సతీమణి విజయమ్మ.. తన భర్త వర్థంతి రోజున.. ఆయనకు అత్యంత ఆత్మీయులతో కలిసి ఆత్మీయ భేటీని నిర్వహించాలని డిసైడ్ చేయటం తెలిసిందే. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసిన విజయమ్మ కొత్త సందేహాలకు కారణమయ్యారు.
ఇంతకాలం లేనిది ఇప్పుడే ఎందుకు నిర్వహిస్తున్నారు? గతంలో ఎందుకు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించలేదు? తెలంగాణలో తన కుమార్తె పార్టీ పెట్టిన వేళ.. తమ బలాన్నిచూపించటం కోసం రెండు రాష్ట్రాల్లో.. పార్టీలకు అతీతంగా తమకు దన్నుగా నిలిచే వారెంతమందో అందరికి తెలిసేలా చేయాలనుకుంటున్నారా? అసలు సమావేశానికి వెళ్లటం మంచిదేనా? కాదా? ఇదేమీ రాజకీయ కార్యక్రమం కాదని.. ఆత్మీయ సమావేశమని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా దీనిపై కూడికలు.. తీసివేతలు ఉంటాయా? లాంటి ప్రశ్నలు ఎన్నో తలెత్తుతున్నాయి.
ఆత్మీయ సమావేశానికి సంబంధించి కొందరిని ఆహ్వానించటం కోసం విజయమ్మ స్వయంగా ఫోన్ చేసినట్లు చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మరోఆసక్తికర అంశం ఏమంటే.. ఇవాల్టి రోజున వైఎస్ ఆత్మీయులు అన్ని పార్టీల్లో ఉన్నారు. అప్పట్లో మంత్రివర్గంలో ఉన్న వారు సైతం ఇప్పుడు వేర్వేరు పార్టీలో ఉండటం తెలిసిందే. సబితా ఇంద్రారెడ్డి చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటే.. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ రావు, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు జగన్ సర్కారులో కీలకంగా ఉన్నారు.
ఒకప్పుడు వైఎస్ కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ ఏపీ బీజేపీలో ఉంటే.. శైలజానాథ్ కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. రఘువీరా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఉండవల్లి పరిస్థితి కూడా అంతే. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఇలా చూసినప్పుడు వైఎస్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు ఈ రోజున అన్ని చోట్ల కనిపిస్తారు.
అలాంటి వారిలో ఎవరు వస్తారు? అన్నది ఒక ప్రశ్న అయితే.. వైసీపీలో ఉన్న వైఎస్ సన్నిహితుల మాటేమిటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. రెండో తేదీన (బుధవారం) నిర్వహించే ఆత్మీయ సమావేశానికి తాము హాజరు కావాలా?వద్దా? అన్నది ఏపీ మంత్రులతోసహా మరికొందరు ధర్మ సంకటంలో పడినట్లుగా తెలుస్తోంది? ఇదే విషయాన్ని జగన్ వరకు ఎలా తీసుకెళ్లాలా? అన్న దానిపై వారు కిందామీదా పడినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఒకరిద్దరు ధైర్యం చేసి జగన్ కు ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. తానే సమావేశానికి వెళ్లటం లేదని.. అలాంటప్పుడు మీరెళ్లటమా? అన్న వ్యాఖ్య చేసినట్లుగా తెలుస్తోంది.
జగన్ మాటల్లో తమకు సమాధానం దొరికినట్లుగా నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి తమ అధినేతగా ఉన్న జగన్ కు ఇష్టం లేనిది తాము చేయలేమని.. ఆత్మీయ సమావేశానికి ఏదో కారణం చెప్పి తప్పించుకునే అవకాశాల కోసం చూస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడీ చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.