బాబుతో సూరీడు భేటీ !!

Update: 2016-03-03 12:38 GMT
ఆంధ్ర‌ప్రదేశ్‌లో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఇప్ప‌టికే వైసీపీ అగ్ర‌నేత‌లు, ముఖ్య‌నేత‌లు తెలుగుదేశం కండువా క‌ప్పుకోగా తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుకు మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి సూరీడు వచ్చారు. సూరీడు సీఎం క్యాంపు కార్యాలయానికి వ‌చ్చి చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. ప్ర‌స్తుతం భేటీ కొన‌సాగుతోంది.

అసెంబ్లీ స‌మావేశాల‌కు ముందే వైసీపీకి చెందిన ముఖ్య‌నేత‌లు టీడీపీలో చేర‌నున్న‌ట్లు తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు,  ప్ర‌క‌టించిన‌ట్లు ఇప్ప‌టికే ప‌లువురు పార్టీ కండువా క‌ప్పుకొన్నారు. ఈ క్ర‌మంలో వైఎస్ రాజ‌కీయ తెరంగేట్రం నుంచి ఆయ‌న మ‌ర‌ణం వ‌ర‌కు వెంటున్న సూరీడు ఇపుడు చంద్రబాబుతో స‌మావేశం అవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. వైఎస్‌ పొలిటిక‌ల్ కెరీర్‌లో ప్ర‌తి అడుగు సూరీడుకు తెలిసిన నేప‌థ్యంలో ఈ క‌ల‌యిక ఆస‌క్తిని, వివిధ అంచ‌నాల‌ను రేకెత్తిస్తోంది.
Tags:    

Similar News