చెప్పినట్లే చేశారు. తూచా తప్పకుండా.. లోక్ సభ సమావేశాల ఆఖరి రోజున సభ నిరవధికంగా వాయిదా పడిన వెంటనే తమ పదవులకు రాజీనామా చేస్తానని చెప్పిన జగన్ పార్టీ ఎంపీలు అందుకు తగ్గట్లే తమ పదవులకు రాజీనామా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా పోరాటంలో సాధనగా తమ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేస్తారని.. అనంతరం పార్లమెంటు నుంచి నేరుగా ఏపీ భవన్ కు వచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించటం తెలిసిందే.
దీనికి తగ్గట్లే సభ నిరవధికంగా వాయిదా పడిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ను కలుసుకునేందుకు బయలుదేరి వెళ్లారు.ఫార్మాట్ లో రూపొందించిన రాజీనామాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ కు సమర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సమర్పించిన రాజీనామా పత్రాల్ని పరిశీలించిన స్పీకర్.. నిర్ణయంపై పునరాలోచించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగానే తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. దీనికి స్పందించిన మహాజన్.. సభలో ఉండి పోరాటం చేయొచ్చు కదా? అని కోరారు. అందుకు వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు సున్నితంగా తిరస్కరించారు. తమ రాజీనామాల్ని తక్షణమే ఆమోదించాలని కోరారు.
రాజీనామా పత్రాల్ని స్పీకర్ కు అందించిన అనంతరం పార్లమెంటు నుంచి ఏపీ భవన్ కు ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు ఏపీ భవన్ కు బయలుదేరారు. ఇక.. జగన్ పార్టీ ఎంపీలంతా తమ రాజీనామా లేఖను ఒక్క వ్యాక్యంతో పూర్తి చేశారు. స్పీకర్ ను ఉద్దేశిస్తూ వారి లెటర్ హెడ్ లో తమ రాజీనామాను తక్షణమే ఆమోదించాలని కోరారు.
స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు జగన్ పార్టీ ఎంపీలు సమర్పించిన రాజీనామా లేఖల్లో ఏం ఉందంటే..
"I hereby tender my resignation of my seat in the house with immediate effect"