పాదయాత్రల పేరు చెప్తే వైఎస్ ఫ్యామిలీ గురించే చెప్పాలేమో. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా - విభజిత ఆంధ్రప్రదేశ్ అయినా కానీ - ఏపీలో తప్ప దేశంలో ఇంకెక్కడా రాజకీయ పాదయాత్రలు ఈ స్థాయిలో జరగవు. అందులోనూ వైఎస్ ఫ్యామిలీ పాదయాత్రల స్పెషలిస్టుగా మారిపోయింది. దేశంలో ఇంకే రాజకీయ కుటుంబమూ చేయనన్ని భారీ పాదయాత్రలు చేసింది ఈ ఫ్యామిలీయే.
మహాత్మాగాంధీ మొదలుకుని ప్రస్తుతం జగన్ వరకు ఎందరో పాదయాత్రలు చేసినా వైఎస్ ఫ్యామిలీకి ఉన్న రికార్డు మాత్రం ఇంకెవరికీ లేదు. వైఎస్ కుటుంబం నుంచి రాజశేఖరరెడ్డి పాదయాత్ర మొదలు పెట్టగా ఆ తరువాత ఆయన కుమార్తె - జగన్ సోదరి షర్మిల కూడా పాదయాత్ర చేశారు. రాజన్న కూతురిని - జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఆమె ఏకంగా 3 వేల కిలోమీటర్లు నడిచారు. ఇప్పుడు జగన్ కూడా తండ్రి - సోదరి బాటలోనే నడవడం ప్రారంభించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కూడా భారీ పాదయాత్ర చేసినా ఆయన కుటుంబం నుంచి ఇంకెవరూ పాదయాత్రలు చేయలేదు. అలాగే సీపీఎం నేత వీరభద్రం కూడా సుదీర్ఘ పాదయాత్ర చేసినా ఆయన కుటుంబం నుంచి కూడా ఇంకెవరూ చేయలేదు. ఇతర రాజకీయ కుటుంబాల నుంచి కూడా ఎవరూ పాదయాత్రల జోలికి వెళ్లలేదు. కానీ... రాజశేఖరరెడ్డి కుటుంబంలో మాత్రం ముగ్గురు భారీ పాదయాత్రలు చేసి రికార్డు సృష్టిస్తున్నారు.