కొంతమంది అభిమానాన్ని ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రెండు తెలుగురాష్ట్రాల మధ్యనున్న విభజన రేఖను చెరిపేసే అభిమానం చాలాచోట్ల కనిపిస్తుంది. దివంగత మహానేతను ప్రాంతాలకు అతీతంగా అభిమానించే వారు కోట్లాది మంది ఉన్నారు. ఇంతమంది అభిమానులు ఉన్నా.. కొందరి అభిమానాన్ని విన్నంతనే కంట వెంట కన్నీరు కారటం ఖాయం. మరీ.. ఇంత అభిమానమా? అనిపించక మానదు.
అలాంటి అభిమాని కుటుంబమే తాజాగా చెప్పేది. నిజానికి ఇప్పుడు చెప్పే అభిమాని ఉదంతం వింటే విస్మయం చెందాల్సిందే. దివంగత మహానేత మీద మరీ ఇంత అభిమానమా? అని అనుకోక తప్పని స్థితి.
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన ఐనాల శ్రీనివాస్ కు వైఎస్ వీరాభిమాని. దివంగత నేత అంటే ఆయనకు ఎంత ఇష్టం అంటే.. వైఎస్ మాదిరే ఆహార్యాన్ని ధరించి.. వైఎస్ గొప్పతనం గురించి పదే పదే చెబుతుంటారు. ఇదే అయితే.. ఇంత ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంతకు మించి అన్నట్లుగా ఆయనకు సంబంధించి మరో విశేషం ఉంది.
వైఎస్ మీద అభిమానంతో తన పేరును మార్చేసుకున్న ఆయన.. సతీమణి పేరును విజయలక్ష్మిగా.. కుమార్తె పేరును షర్మిలగా.. కుమారుడి పేరును జగన్ గా పేర్లు మార్చుకోవటం.. కొత్తగా పెట్టుకోవటం చేసుకున్నారు. ప్రజలకు వైఎస్ మాదిరి సేవ చేసిన నాయకుడు ఎవరున్నారు? ఆయనంటే నాకు పిచ్చి అంటూ ఎమోషన్ అయ్యే ఈ జూనియర్ వైఎస్ మాటలు వింటే.. ఈ తరహా నిస్వార్థమైన అభిమానమే వైఎస్సార్ కాంగ్రెస్ కు నిజమైన అండ అనిపించక మానదు.