ఏపీలో రాజకీయాలు రోజుకో గందరగోళంగా ..పూటకో గొడవ అన్నట్టుగా తయారైయ్యాయి. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ఓ వైపు కొనసాగుతుంటే, రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య బాహాబాహీలు, దాడులు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ వ్యవహారం ఇలా ఉంటే .. తాజాగా చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో స్థానికంగా కలకలం రేగింది.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం, గుడిపల్లి మండలంలో ఓ ఎన్ కొత్తూరు గ్రామ శివారులో ఉన్న దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.అలాగే, అక్కడ నుండి విగ్రహం కనిపించకుండా తీసుకెళ్లిపోయారు. ఈరోజు ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు చూసే సరికి విగ్రహం కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం చేయడం, ఆ పై మాయం కావడం తెలుగుదేశం పార్టీ నేతల పనే అని వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విగ్రహాన్ని తొలగించిన వ్యక్తులను పట్టుకోవాలంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామంలో ఆందోళన చేపట్టారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ గ్రామం కుప్పం నియోజకవర్గంలో ఉండడంతో ఇది తెలుగుదేశం పార్టీ నేతల పనేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు విగ్రహ ధ్వంసం ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో పరిషత్ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో టిడిపి నాయకులు దౌర్జన్యకాండ చేశారని వైసిపి నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల్లో గెలవలేకపోయామన్న అక్కసుతో టిడిపి కార్యకర్తలు ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.