నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు అవకాశాలు లేవన్న సత్యం గుర్తించిన తరువాత చంద్రబాబు మొత్తం తన సర్వ సైన్యాన్ని అక్కడ మోహరించారు. అంతేకాదు... కేంద్రం నిధులిచ్చినా కూడా ఎన్నడూ ఆ డబ్బుతో జిల్లాలను అభివృద్ధి చేయని చంద్రబాబు ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక కోసం అక్కడ కోట్లు కుమ్మరిస్తున్నారు. ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న పనులు... అందరూ మర్చిపోయిన హామీలు కూడా పూర్తి చేసేస్తున్నారు. దీనికోసం ఏకంగా 3000 కోట్ల రూపాయలతో పనులు చేయిస్తున్నారని చెప్తున్నారు. ఇంతకాలం పట్టించుకోనివన్నీ ఇంత హడావుడిగా చేయడానికి కారణం ఉప ఎన్నికలేనని విపక్ష నేతలు ఆరరోపిస్తున్నారు. అంతేకాదు... అభివృద్ధి పేరుతో ఇష్టారాజ్యంగా పేదల ఇళ్లను కూలగొడుతున్నారని ఆరోపిస్తున్నారు.
నంద్యాలలో ఉప ఎన్నిక కోసం అడ్డగోలుగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టి... అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా కూడా చిరువ్యాపారులు, మధ్యతరగతి ప్రజల జీవితాలను సర్వనాశనం చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల వేళ .. అభివృద్ధి, సుందరీకరణ పేరుతో నంద్యాలలో అరాచకం సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు.
రోడ్డు విస్తరణ పేరుతో రోడ్లకు ఇరువైపుల ఉన్న ఇళ్లను, షాపులను నేలమట్టం చేశారు. 800 షాపులు, 100 ఇళ్లను కూల్చివేసినట్లు చెప్తున్నారు. రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలంటే మున్సిపాలిటీ తీర్మానం చేయాలి.. విస్తరణ కారణంగా నష్టపోయేవారికి ముందుగానే సమాచారం ఇవ్వాలి. పరిహారాన్ని కూడా ప్రకటించాలి. అయితే... ఇలాంటిదేమీ లేకుండా యంత్రాలతో రోడ్డుపక్కల భవనాలను నేలమట్టంచేశాయి.
అధికారులు మాత్రం… ముందస్తు సమాచారమిచ్చి.. ఖాళీ చేసేందుకు మూడు రోజుల పాటు సమయం కూడా ఇచ్చామంటున్నారు. మూడు రోజుల సమయంలో బాధితులు ఎలా స్పందించగలరని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తీరుపై స్థానిక వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.