వైసీపీ ఏఎంసీ వైస్ చైర్మన్ తోడల్లుడికి డెత్ సర్టిఫికెట్ 30 రోజులైనా రాలేదా?

Update: 2020-08-09 06:30 GMT
ప్రకాశం జిల్లాలో పశ్చిమపట్నంకు చెందిన ఒక  ఏఎంసీ   వైస్ చైర్మన్ సొంత తోడల్లుడికి డెత్ సర్టిఫికెట్ 30 రోజులు తిరిగినా ఇవ్వలేదంట ఆ మండల ఎమ్మార్వో . ఎందుకంటే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే సామాజికవర్గం.. సాక్షాత్తూ సీఎం సామాజికవర్గానికి సదురు ఏఎంసీ  వైస్ చైర్మన్ సామాజికవర్గం పూర్తి వ్యతిరేకం అని ఇలా చేశాడట.. అందుకే తిప్పుతున్నాం అని ఆఫీస్ వాళ్లు చెప్పారట..

అయితే ఆ మండలం వైసీపీ నాయకులు పోయి దీనిపై నిలదీస్తే ఎమ్మెల్యే ఆపమన్నాడు అని ఆ అధికారి చెప్పాడంట.. నాకు తెలియకుండా ఆ సామాజికవర్గంకు ఏమీ పనిచేసినా నిన్ను ట్రాన్స్ ఫర్ చేస్తా అని ఆఫీసర్ కు హుకూం జారీ చేశాడని ఆ అధికారి వాపోయాడట..

ఇలా అయితే వైసీపీలో ఉండడం కష్టం అని ఆ మండలం నాయకులు హైకమాండ్ కు చెప్పాలని అపాయింట్ మెంట్ అడిగారని తెలుస్తోంది. వైసీపీ పాలనలో ఇతర ప్రత్యర్థుల సామాజికవర్గాల విషయంలో ఇలా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుందని సదురు నేతలంతా వాపోతున్నారట.. ఇప్పుడీ చర్చ ప్రకాశం జిల్లాలో విస్తృతంగా ప్రచారం సాగుతూ హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News