ఏపీ విపక్ష నేత ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార వైసీపీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో పాగా వేయటం.. బాబుకు భారీ షాకివ్వటం తెలిసిందే. తాజాగా ముగిసిన పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో అదరగొట్టేశారు. సొంత నియోజకవర్గంలో తనకున్న సత్తాను చాటారు.
పంచాయితీ ఎన్నికల్లో నూటికి నూరుశాతం సీట్లను ఒకే పార్టీకి చెందిన మద్దతుదారులు సొంతం చేసుకోవటం చాలా అరుదు. ఆ ఫీట్ ను సొంతం చేసుకున్నారు జగన్. ఆదివారం జరిగిన చివరి విడత ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నూటికి నూరుశాతం సర్పంచ్ లను అధికార పార్టీ మద్దతుదారులు సొంతం చేసుకోవటం విశేషం. అదే సమయంలో.. పులివెందులలో పాగా వేయటానికి టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేసినా.. అక్కడి ప్రజలు రిజెక్టు చేశారు. దీంతో.. విపక్ష పార్టీ ఉనికి సీఎం సొంత నియోజకవర్గంలో లేదన్న విషయం ఇట్టే అర్థమైందని చెప్పాలి.
ఇక.. టీడీపీ ఎమ్మెల్సీ.. పులివెందుల నియోజకవర్గ ఇంఛార్జి బీటెక్ రవి ప్రాతినిధ్యం వహించే సొంత పంచాయితీ అయిన కసనూరులోనూ టీడీపీ మద్దతు ఇచ్చే అభ్యర్థులు ఎవరూ వైసీపీ మద్దతుదారులకు పోటీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఓటమిపాలు కావటం గమనార్హం.
పులివెందుల నియోజకవర్గంలో 108 పంచాయితీలకు ఎన్నికలు జరిగాయి. వీటిల్లో అత్యధికం 90 పంచాయితీల్ని ఏకగ్రీవాల ద్వారా ఓకే చేశారు. నామినేషన్ల గడువు పూర్తి అయ్యే నాటికి కేవలం ఐదు మండలాల్లోని 18 పంచాయితీలకు మాత్రమే ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఎనిమిది పంచాయితీల్లో టీడీపీ మద్దతుదారులు బరిలోకి దిగినా.. ఒక్కస్థానాన్ని గెలుచుకోలేకపోయారు. నంద్యాలంపల్లి.. పైడిపాలెం.. దుగ్గనగారి పంచాయితీల్లో కేవలం ఆరు వార్దులే విపక్ష పార్టీకి లభించాయి. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో వైసీపీకి ఉన్న ఆదరణ ఏ స్థాయిదన్న విషయాన్ని తాజా ఎన్నికల్లో మరింత స్పష్టమైందని చెప్పక తప్పదు.