జగనన్న మంత్రులు చేపట్టిన బస్సు యాత్రకు విజయనగరంలో బ్రేక్ పడింది. ఇక్కడ ఏర్పాటు చేసిన సభ వర్షం కారణంగా రద్దయింది. దీంతో నిరుత్సాహంతో వైసీపీ శ్రేణులు వెనుదిరిగాయి. ఉన్నట్టుండి వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పుల రీత్యాలు తీవ్రం అయిన గాలులతో కూడిన వాన ఉత్తరాంధ్ర జిల్లాను కుదిపేసింది. ఏం చేయాలో తేల్చుకోలేక సభను రద్దు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
ఇక నాయకులు కొందరు విజయనగరంలోనే ఉండిపోతారా లేదా విశాఖకు వెళ్తారా అన్నది కూడా తేలడం లేదు. గురువారం ఉదయం బీసీ బస్సు యాత్ర లాంఛనంగా శ్రీకాకుళంలో ప్రారంభం అయింది. అనంతరం మీడియా మీట్ కూడా నిర్వహించారు. అరసవల్లిలో పూజల అనంతరం ఈ యాత్రకు బొత్స (సీనియర్ మంత్రి) శ్రీకారం దిద్దారు. రేపు రాజమండ్రికి చేరుకున్నాక అక్కడి వాతావరణం దృష్ట్యా బహిరంగ సభను నిర్వహించే ఆలోచన చేస్తున్నారు వైసీపీ వర్గీయులు.
ఇక సామాజిక న్యాయం పేరిట ధర్మానతో సహా కొందరు చెప్పిన నిర్వచనాలపై టీడీపీ సెటైర్లు వేస్తోంది. మొదట బీసీలు అంటే ఎవరో తెలుసుకుని , వారి కోసం ఏం చేశారో చెప్పాలని టీడీపీ హితవు చెబుతో్ంది. బీసీలు అంటే బాబు గారి క్యాస్ట్ అని చెప్పడం కాదు, ఆ విధంగా ఆ రోజు మేమేం చేశామో కూడా తెలుసుకుని మాట్లాడాలని, బడుగుల కోసమే ఏర్పడిన టీడీపీని విమర్శించే ముందు వైసీపీ ఆత్మ విమర్శ లేదా ఆత్మావలోకన చేసుకోవాలని హితవు చెబుతున్నారు.
ఎపార్ట్ ఫ్రమ్ దిస్ శ్రీకాకుళం మొదలుకొని అనంతపురం దాకా సాగే యాత్రలో ఎక్కడిక్కడ మంత్రులను అడ్డుకునేందుకు దళిత సంఘాలు సిద్ధం అవుతున్నాయి. విజయనగరంలో కూడా అలాంటి ప్రయత్నం జరిగినా పోలీసులు అప్రమత్తమై సంబంధిత నిరసనకారులను ముందస్తుగా అరెస్టులు చేసి, స్టేషన్ కు తరలించారు. దళితులకు సంబంధించి ఇరవైకి పైగా పథకాలను రద్దు చేసిన ఘనత వైసీపీదేనని అంటున్నారు వీరంతా ! ఇక మంత్రుల తూగో పర్యటనలో భాగంగా కూడా దళితుల నుంచి నిరసనలు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
కానీ పోలీసులు మాత్రం నిరసనలకు తావే లేదని చెబుతున్నారు. దళితులకు కీలక పదవులు అంటూనే గోదావరి జిల్లాలకు చెందిన మంత్రుల హయాంలోనే వారి కళ్లముందటే ఎన్నో అన్యాయాలు చేస్తున్నారని, ఆధిపత్య కులాల ధోరణులకు సామాన్యులు బలి అయిపోతున్నారని దళిత సంఘాల నాయకులు ఆవేదన చెందుతూ ఉన్నారు.