ఏళ్లకు ఏళ్లుగా ప్రజల మధ్యనే తప్పించి.. కుటుంబాన్ని.. కుటుంబ వ్యవహారాల్లో పెద్దగా పాలుపంచుకోని ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎన్నికల వేళలో విపరీతంగా పర్యటనలు జరిపిన ఆయన.. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ముగిసిన నాటి నుంచి ఆయన పెద్దగా బయటకు రావటం లేదు.
కుటుంబంతో గడపటంతో పాటు.. ఒకట్రెండు టూర్లకు వెళ్లి వచ్చిన ఆయన.. ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అనవసరంగా మాట్లాడేందుకు ఏ మాత్రం ఇష్టపడని జగన్.. పోలింగ్ ముగిసిన నాటి నుంచి లో ప్రొఫైల్ మొయింటైన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు (మంగళవారం) రాత్రి హైదరాబాద్ నుంచి పులివెందులకు చేరుకోనున్నారు.
అనంతరం రేపు (బుధవారం) ఉదయం 8.30 గంటల నుంచి ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం కానున్నారు. బుధవారం సాయంత్రం పులివెందుల పట్టణంలోని వీజే ఫంక్షన్ హాల్లో ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. గురువారం ఉదయం నుంచి తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండనున్నట్లు జగన్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. ఎన్నికల ఫలితాలు వెలువడనున్న మే 23కు ఒకట్రెండు రోజుల ముందే.. హైదరాబాద్ నుంచి తాడేపల్లిలోని తన సొంతింటికి మారనున్నట్లుగా జగన్ వర్గాలు చెబుతున్నాయి. లోటస్ పాండ్ ను దాదాపుగా ఖాళీ చేసినట్లేనని చెబుతున్నారు. రానున్న రోజుల్లో జగన్ తాడేపల్లిలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఫలితాలు వెల్లడికి రెండు రోజుల ముందే సొంతింటికి చేరుకోనున్నారు. ఫలితాల్ని సొంతింటి నుంచే వీక్షించనున్నారని చెప్పక తప్పదు.