ఒక్కడుగా వచ్చి ఇంత పెద్ద పార్టీని విస్తరించడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ దాన్ని జగన్ సాధించారు. సరిగ్గా ఇప్పటికి పదకొండేళ్ల క్రితం ఆయన ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి వద్ద తన పార్టీ పేరుని ఆయన ప్రకటించారు. అది 2011 మార్చి 12. నాడు ఉమ్మడి ఏపీలో కొత్త ప్రాంతీయ పార్టీ ఏర్పాటు అయింది. అప్పటిదాకా బలంగా ఉన్న టీడీపీకి పోటీగా వైసీపీ వచ్చినట్లు అయింది.
అది లగాయితూ ఇన్నేళ్ళ ప్రస్థానంలో ఎన్నో ప్రతికూలతలు, సవాళ్ళూ జగన్ ధీటుగానే ఎదుర్కొన్నారు. మొత్తానికి సీఎం జగన్ అనిపించుకున్నారు. మరి కొద్ది నెలలలో మూడేళ్ళ సీఎం గా పాలన పూర్తి చేసుకోనున్నారు. అయితే ఒక వెల్లువగా వచ్చి 2019 ఎన్నికల వేళ సునామీగా ఏపీ అంతా వ్యాపించి 151 సీట్లతో బంపర్ విక్టరీ కొట్టిన వైసీపీకి అసలైన సవాళ్ళు ఇపుడే ఎదురవుతున్నాయని అంటున్నారు.
నిజానికి అధికారం ముళ్ల కిరీటం. పైగా అష్టకష్టాలతో అల్లాడురున్న ఏపీ లాంటి రాష్ట్రాన్ని సీఎం గా నిభాయించడం అంటే చాలా కష్టం. డబ్బులు ఉంటే ఎవరైనా పాలన బాగానే చేస్తారు. ఏమీ లేని చోట అప్పులతో బండి లాగించడం అంటే కష్టమే. ఇక విపక్షంలోకి వచ్చినా కూడా టీడీపీది నీటిలో ఉన్న మొసలి బలం లాంటి శక్తి. చంద్రబాబు లాంటి రాజకీయ గండరగండడు అపోజిషన్ లో ఉంటే ఎదుర్కొని ముందుకు సాగడం అంటే అది పెను సవాలే.
ఇక ఇన్నాళ్ళ కష్టాలూ కడగండ్లూ ఒక ఎత్తు అయితే ఇపుడే అసలైన కధ అని కూడా విశ్లేషణలు ఉన్నాయి. మూడేళ్ల పాలనలో తెచ్చిన అప్పులు అన్నీ అయిపోయాయి. రానున్న రెండేళ్ళలో సంక్షేమ పాలన ఇదే తీరున జోరున సాగించాల్సి ఉంటుంది. ఇంకో వైపు వ్యక్తిగతంగా సొంత బాబాయ్ హత్య కేసుకు జగన్ జవాబు చెప్పాలని విపక్షాలు కార్నర్ చేస్తున్నాయి.
వీటితో పాటు పార్టీని ప్రభుత్వాన్ని ఒక్కరే నడపడం అంటే అది కూడా ఇబ్బందే. డ్యుయల్ రోల్ ఎపుడూ భారమే. పార్టీని వదిలేసి ముఖ్యమంత్రిగానే మూడేళ్ళుగా జగన్ గడిపారు. దాంతో పార్టీని గాడిన పెట్టడం అంటే మాటలు కాదు, అధికారంలో ఉన్న పార్టీకి ఎన్నో తలనొప్పులు. ఈ కీలక సమయంలో ముప్పయ్యేళ్ళ సీఎం అన్న నినాదాలు క్యాడర్ అక్కడక్కడ ఇస్తున్నా కూడా వైసీపీలో ఏదో తెలియని వెలితి బెంగ అయితే ఉన్నాయని అంటున్నారు.
గతంలో ఉన్న జోష్ అయితే కానరావడం లేదు అని కూడా అంటున్నారు. దానికి కారణం రాజకీయం ఎపుడూ ఒకేలా ఉండదు, జగన్ ఇమేజ్ మీదనే నిర్మాణం అయిన వైసీపీ టీడీపీలా సంస్థాగతంగా ఈ రోజుకీ బలంగా లేదు అన్న విమర్శ ఉంది. ఇక కొన్ని సెక్షన్లలో నేటికీ రీచ్ కాలేకపోయింది అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా చాలా సవాళ్ళ మధ్య వైసీపీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతోంది.
ఇక మీదట దూకుడు చేయాలని వైసీపీ అనుకుంటే మాత్రం ఆ జోరు ఎలా ఉంటుంది అన్నదే అందరికీ ఆసక్తిని గొలిపే అంశం.