గ్రామ సచివాలయ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ చంద్రబాబు - లోకేష్ - పచ్చమీడియా పనిగట్టుకొని చేస్తున్న విమర్శలకు తాజాగా ఏపీ డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్ చంద్రబోస్ - ఆళ్లనాని - పుష్ప శ్రీవాణి - నారాయణ స్వామి - అంజాద్ భాషా లు ఓ బహిరంగ లేఖలో తూర్పార పట్టారు. చంద్రబాబు దీనిపై రాసిన బహిరంగ లేఖకు కౌంటర్ గా ఘాటుగా మరో లేఖను డిప్యూటీ సీఎంలు రాశారు.
ఈ లేఖలో సచివాలయ పరీక్షల్లో అవకతవకలంటున్న లోకేష్ - చంద్రబాబులను టార్గెట్ చేశారు. దమ్ముంటే గ్రామ సచివాలయ పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన వారికి, చంద్రబాబు కుమారుడు లోకేష్ కు కలిపి పరీక్ష పెడుదామని.. దీనికి సిద్ధమేనా అని డిప్యూటీ సీఎంలు సవాల్ విసిరారు. లోకేష్ లాగా అత్తెసరు చదువులతో అభ్యర్థులు చదవలేదని ఎద్దేవా చేశారు. విదేశీ విద్య కోసం లక్షలు వేరే వారితో డోనేషన్లు కట్టించుకొని ఏమీ చదవని లోకేష్ బండరాం అందరికీ తెలుసునని విమర్శించారు.
జగన్ ప్రభుత్వం కనివీని ఎరుగని రీతిలో ఏకంగా 1.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో భర్తీ చేస్తుంటే చంద్రబాబు జీర్ణించుకోలేక ఇలాంటి విమర్శలు - అక్కసు వెళ్లగక్కుతున్నాడని డిప్యూటీ సీఎంలు లేఖలో మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఎంసెట్ - దొంగనోట్ల - స్టాంప్ పేపర్ల - ఇంటర్మీడియెట్ ప్రశ్నాపత్రాల లీకేజీలాంటి కావని స్పష్టం చేశారు.
1.25 లక్షల ఉద్యోగాలిచ్చిన జగన్ ఇక నవరత్నాలు అమలు చేస్తే చంద్రబాబుకు గంగవెర్రులెత్తుతారో ఊహించవచ్చని డిప్యూటీ సీఎంలు లేఖ ఎద్దేవా చేశారు. చంద్రబాబుది పనికి మాలిన అనుభవం కాదని.. ప్రజల మీద అభిమానం కావాలని స్పష్టం చేశారు. నాలుగు నెలలు కూడా నిండని వైసీపీ ప్రభుత్వంపై కడుపు మండి చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.