ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఏపీలో లోక్ సభలో ఎన్నికలతో పాటు రాష్ట్ర ఎన్నికలు కూడా ఒకేసారి జరగబోతున్నాయి. దీంతో.. అధికార టీడీపీ - ప్రతిపక్ష వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉంది. ఇక ఏపీలో ఈసారి ఎవరి అధికారం వచ్చే అవకాశం ఉందని.. ఇప్పటికే రకరకాల సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. వీటిల్లో ఎక్కువ సర్వేలు..వైసీపీకే అవకాశం ఎక్కువ ఉందంటూ వెల్లడించాయి. ఇప్పుడు టైమ్స్ నౌ నిర్వహించిన సర్వేలో కూడా వైసీపీకి క్లియర్ మెజారిటీ దక్కింది. అయితే.. టైమ్స్ నౌ.. స్టేట్ ఎన్నికల గురించి కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో సర్వే చేసి చెప్పింది. ఇందులో.. మొత్తం 25 సీట్లకు గాను వైసీపీకి 23 వస్తే.. టీడీపీకి కేవలం రెండంటే రెండే దక్కాయి.
ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాలున్నాయి. వీటిల్లో 23 సీట్లు కేవలం వైసీపీకి వస్తాయట. ఇక మిగిలిన రెండు సీట్లు టీడీపీకి వస్తాయని టైమ్స్ నౌ సర్వే తేల్చిచెప్పింది. కాంగ్రెస్ - బీజేపీ - జనసేన.. అసలు పోటీలోకి కూడా రావని చెప్పేసింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే దాదాపుగా రాష్ట్రంలోనూ వస్తాయి. దీన్నిబట్టి చూస్తే.. వైసీపీకి దాదాపు 140 సీట్లకు పైనే వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అంటే ఎలా చూసినా ఈసారి వైసీపీకి అధికారం దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే.. ఈ ఫలితాలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వచ్చేవి. కానీ ఎన్నికలకు ఇంకా టైమ్ ఉంది. ఈ లోపు ఏదైనా జరగొచ్చు.