వైసీపీ హైకమాండ్ వర్సెస్ కర్నూలు ఎమ్మెల్యే.. డిష్యుం.. డిష్యుం..

Update: 2021-03-31 09:30 GMT
ఇప్పుడే వైసీపీ ఎమ్మెల్యేలు అధిష్టానం మాట వినకుంటే.. ఇక ఎన్నికల వేళ వారిని ఆపతరమా? అని వైసీపీలో చర్చించుకుంటున్నారు. ఓ ఎమ్మెల్యే ఏకంగా వైసీపీ అధిష్టానంలోని ఓ పెద్దను ఎదురించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. హైకమాండ్ చెప్పినా వినని ఎమ్మెల్యే ధిక్కార ధోరణిపై అందరూ ముక్కునవేలేసుకుంటున్నారు. ఇలాంటివి ఆదిలోనే కంట్రోల్ చేయకపోతే వైసీపీ పరిస్థితి చేయిదాటిపోవచ్చని హెచ్చరిస్తున్నారు.

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో తన ప్రతాపం చూపించింది. క్లీన్ చీట్ గా జెండాను పాతేస్తూ దూసుకెళ్లింది. ఫ్యాన్ పార్టీకి తిరుగులేదన్నట్లుగా ప్రతీ ఎన్నికల్లో తనదే పైచేయి సాధించింది. అయితే అధికారంలో ఉన్న ఏ పార్టీకి అయినా ఇలాంటి విజయాలు మామూలే. కానీ ప్రతిపక్షాలు ఎన్ని ఎత్తుగడలు వేస్తున్నా వాటిని అధిగమించి తన పార్టీని కాపాడుకోవడం మాములు విషయం కాదు. మూలమూలానా.. గ్రామ గ్రామానా వైసీపీ ఆదరిస్తున్నారని ఆ ఎన్నికలను బట్టి తెలుస్తోంది. ఈ పరిణామాలతో  అధినేత జగన్ ఫుల్ ఖుషీలో ఉన్నాడు. కానీ చాపకింద నీరులు గ్రూపు విభేదాలు ఏర్పడుతున్నాయి. అవి కమ్ముకున్న నిప్పులా మారుతున్నాయి. ఏరోజైనా అవి తారాస్థాయికి చేరి చివరికి పార్టీని దెబ్బతీసేలా ఉన్నాయి.

కర్నూలు జిల్లాలో జరిగిన ఓ విషయాన్ని ఇక్కడ చర్చిద్దాం. ఈ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాడు. తనకు ఎదురు లేకుండా వెళ్తూ ప్రజల మన్ననలను పొందుతున్నాడు. ఇక్కడ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత, ఆ ఎమ్మెల్యేకు మధ్య పొసగడం లేదు. ఇటీవల ఓ విషయంలో వీరిద్దరి మధ్య వాదోపవాదనలు తీవ్ర స్థాయికి చేరాయట. 2019 ఎలక్షన్ సమయంలో  జిల్లాలోని ఓ మండలానికి చెందిన వ్యక్తి సదరు ఎమ్మెల్యేకు ఓ పని చేయమంటే చేయలేదు. అయితే అతను టీడీపీకి మాత్రం దగ్గరుండి ఆ పని చేశాడంట.

ఇప్పుడు ఆ వ్యక్తి హైకమాండ్ దగ్గరికి వెళ్లి తనకు పని ఇప్పించాలని ఎమ్మెల్యేకు చెప్పండి.. అందుకు తాను పార్టీలో చేరుతానని చెప్పాడట. హైకమాండ్ లో ఉన్న ఓ సీనియర్ నేత సదరు ఎమ్మెల్యేకు ఫోన్ చేసి ఇలా మండలానికి చెందిన ఓ వ్యక్తి తనకు కావాల్సిన వ్యక్తి అని.. అతనికి పని ఇప్పించాలని హుకుం జారీ చేశాడట. అయితే ఆ ఎమ్మెల్యే ‘‘నువ్వు చేర్చుకోమంటే.. చేర్చుకోను.. నేను అతన్ని చేర్చుకోవాలి అంటే మా మండల నాయకుడిని అడగాలి’’ అని ముఖం మీదే వెటకారంగా చెప్పాడట... దీంతో ఆ సీనియర్ నేత సదురు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసి ‘నువ్వు మంత్రి ఇలాకలో పనిచేస్తున్నావ్.. ఆ మంత్రి నాకు దగ్గరి వ్యక్తి.. నేను చెప్పింది చేయాలి..’ అని స్పష్టం చేశాడట... దీంతో ఆ ఎమ్మెల్యే ‘నువ్వు చేర్చుకుంటే.. చేర్చుకో.. నేను మాత్రం దగ్గరికి రానియ్యను’ అని ఖరాఖండిగా చెప్పేశాడట. అంతేకాకుండా నాకు మంత్రి కంటే కార్యకర్తలే ముఖ్యం.. కావాలంటే నేను సీఎం దగ్గరే తేల్చుకుంటా’నని ఫోన్ పెట్టేశాడట.

ఇలా ఈ ఒక్క ఎమ్మెల్యేనే కాకుండా మిగతా ఎమ్మెల్యేలు కూడా సదరు హైకమాండ్ వ్యక్తి ద్వారా సఫర్ అవుతున్నారట. ఇటీవల కర్నూలు ఏయిర్ పోర్టు ప్రారంభించిన సందర్భంలో ఈ విషయాలు బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎలక్షన్ సమయం వచ్చేసరికి ఇలాంటివి పెద్ద ఎత్తున బయటకి వచ్చే ప్రమాదం ఉందని, గతంలో టీడీపీలో కూడా ఇదే జరిగి ఆ పార్టీ తీవ్రంగా నష్టపోయిందని అనుకుంటున్నారు. ఇప్పటికైనా హైకమాండ్ దృష్టి పెట్టకపోతే పార్టీ పరిస్థితి దిగజారుతుందని వాపోతున్నారు.
Tags:    

Similar News