ఆ పార్టీలో ఇన్‌ చార్జులే అభ్యర్థులు..

Update: 2019-01-23 07:00 GMT
మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ లో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఏపీలో లోక్‌ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ పోరు కూడా సాగనుంది. ఈ నేపథ్యంలో ఇక్కడి రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నాయి. కొన్ని పార్టీలు తాము గెలిచేందుకు వ్యూహాలు పన్నుతుండగా వైఎస్సార్‌ పార్టీ ఏకంగా అభ్యర్థులను ప్రకటిస్తోంది. సాధారణంగా నోటిఫికేషన్‌ వచ్చాక ఆయా పార్టీలు టిక్కెట్ల కేటాయింపులు చేస్తారు. కానీ వైసీపీ మాత్రం తమ క్యాండెట్లకు సీట్లు కన్ఫామ్‌ చేసేస్తున్నారు. వీటిలో జమ్మలమడుగు సీటు స్వయంగా పార్టీ అధినేత జగన్‌ ప్రకటించడం విశేషం.

జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీ ఇన్‌ చార్జిగా డాక్టర్‌ సుధీర్‌ రెడ్డి కొనసాగుతున్నారు. పార్టీ ఇన్‌ చార్జిగా కొనసాగుతున్న సుధీర్‌ రెడ్డినే అభ్యర్థిగా ప్రకటించాడు. కదిరిలోనూ జగన్‌ ఈ విధానాన్నే ఫాలో అయ్యాడు. అక్కడ ఇన్‌ చార్జిగా పనిచేస్తున్న డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డిని నిలబెట్టాడు. ఇక్కడ ఇదివరకు ఇన్‌ చార్జిగా ఉన్న చాంద్‌ భాషా పార్టీ ఫిరాయించడంతో పీవీ సిద్ధారెడ్డికి వైసీపీ ఇన్‌ చార్జి పదవి దక్కింది. ఇప్పుడు ఆయన వైసీపీ తరుపున పోటీ చేయనున్నాడు.

టీడీపీ కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో పోరు రసవత్తరంగా మారనుంది. ఇక్కడి రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీతకు పోటీగా వైసీపీ గట్టి నిర్ణయమే తీసుకుంది. తమ పార్టీ తరుపున తోపుదుర్తి ప్రకాశ్‌ కే ఖరారు చేసేంది. అయితే తోపుదుర్తి ప్రకాశ్‌ కూడా ఇక్కడ వైసీపీ ఇన్‌ చార్జిగా ఉన్నారు. గత రెండు పర్యాయాలుగా సునీత చేతిలో ప్రకాశ్‌ ఓడిపోయారు. సాధారణంగా ఏ పార్టీ అయినా రెండు పర్యాయాలు ఓడిపోతే టికెట్‌ ఇచ్చేందుకు వెనుకాడుతుంది. కానీ ప్రకాశ్‌ కే మళ్లీ టీకెట్‌ కేటాయించడంతో ఈసారి ఎలాగైనా గెలిచేందుకు ప్రకాశ్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు.

శింగనమల నియోజకవర్గంలో వైసీపీ మహిళకు టీకెట్‌ కేటాయించింది. ఇక్కడ జొన్నలగడ్డ పద్మావతి పార్టీ ఇన్‌ చార్జిగా కొనసాగుతున్నారు. దీంతో ఆ పార్టీ అధినేత పరోక్షంగా ఆమెకే టికెట్‌ కేటాయించే విధంగా సంకేతాలు పంపినట్లు సమాచారం. గత ఎన్నికల్లోనూ పోటీ చేసిన ఆమె పరాజయం పాలయ్యారు. దీంతో ఆర్థికంగా దెబ్బతిన్నారు.  ఈ నేపథ్యంలో మళ్లీ పద్మావతికే వైసీపీ టికెట్‌ అని తెలుస్తోంది.

దీంతో వైసీపీలో పార్టీ ఇన్‌ చార్జులుగా ఉన్న వారిలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకపోయినా చాలా చోట్ల విజయం సాధించింది. ఇప్పటికే పార్టీ అధినేత జగన్‌ పాదయాత్ర చేసి ముగించారు. ఇక ప్రత్యక్షంగా ఎన్నికల పోరులో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో వైసీపీ నుంచి టికెట్‌ కోసం ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు.

Full View
Tags:    

Similar News