జ‌గ‌న్‌ పై దుష్ర్ప‌చారం..ఛాన‌ల్ల‌కు నోటీసులు

Update: 2017-04-01 17:39 GMT
త‌మ పార్టీపై జ‌రుగుతున్న దుష్ప‌చారంపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. ఏపీ ప్రతిపక్షనేత - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జ‌రుగుతున్న అవాస్త‌వ ప్ర‌చారాన్ని అడ్డుకట్ట వేసేందుకు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వైఎస్ జ‌గ‌న్ ఆస్తుల‌ను ఈడీ అటాచ్ చేసింద‌ని పేర్కొంటూ ప్ర‌సారం చేసిన క‌థ‌నాల‌పై ఘాటుగా స్పందిస్తూ ఏబీఎన్ - టీవీ9 - ఈటీవీలకు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ లీగల్ నోటీసులు పంపించారు. చట్టపరంగా ఈ మూడు చానళ్లపై చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో స్ప‌ష్టం చేశారు.

విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల్లో భాగంగా ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దేశవ్యాప్తంగా 300 కంపెనీలలో తనిఖీలు చేపట్టింది. రాజేశ్వర్ ఎక్స్‌ పోర్టు అనే కంపెనీ సైతం ఇందులో ఉన్నట్లుగా ఈడీ ట్వీట్ చేసింది. ఈడీ ట్వీట్‌ లో వాస్తవాలను ధృవీకరించుకోకుండా వైఎస్ జగన్‌ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ఏబీఎన్ - టీవీ9 - ఈటీవీ చానళ్లు ఆయనపై అసత్య కథనాలను ప్రసారం చేశాయి.  అవాస్తవమైన, నిరాధార కథనాలు ప్రసారం చేయడంపై వైఎస్ ఆర్ సీపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేసింది. వాస్తవాలను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేసింది. వైఎస్ జగన్ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా అసత్య కథనాలను ప్రసారం చేసినందుకు నోటీసులు ఇస్తున్న‌ట్లు తెలిపింది. ఈడీ తన ట్వీట్లో పేర్కొన్న రాజేశ్వర్ ఎక్స్‌పోర్టుతో గానీ, మరే ఇతర షెల్ కంపెనీతో గానీ వైఎస్ జగన్‌కు సంబందంలేదని నోటీసులలో స్పష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News