వైసీపీలో కీల‌క నేత‌ల సైలెంట్ పార్టీకి చేటు చేస్తుందా..?

Update: 2022-08-27 12:30 GMT
రాష్ట్రంలో వైసీపీకి కీల‌క నాయ‌కులు ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఎంతో మంది గెలిచినా.. అంద‌రికీ వాయిస్ లేదు. అంద‌రికీ ప్ర‌జ‌ల్లో మంచి మార్కులు కూడా లేదు. ఏదో జ‌గ‌న్ సునామీ.. వైసీపీ ప్ర‌బావం వంటివి పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన వారికి ప్ల‌స్‌లుగా మారాయి. దీంతో వారు గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల  నాటికి పార్టీని బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లాలి. దీనికి బ‌ల‌మైన నాయ‌కుల అవ‌స‌రం ఎంతైనా ఉంది. అయితే.. ఇప్పుడు వారంతా కూడా సైలెంట్‌గా ఉన్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు మాజీ మంత్రి.. అనిల్‌కుమార్ యాద‌వ్‌, సీనియ‌ర్ నాయ‌కుడు.. ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, మ‌రో నేత‌.. ఎమ్మెల్యే సామినేని ఉద‌యభాను, మ‌రో కీల‌క నాయ‌కుడు ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌.. కిల్లి కృపారాణి, కొలుసు పార్థ‌సార‌థి, బుట్టా రేణుక‌.. ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌..

శ్రీధ‌ర్‌రెడ్డి ఇలా ప‌దుల సంఖ్య‌లో నాయ‌కులు బ‌ల‌మైన ప్రాతినిధ్యం ఉన్న‌వారు. వీరి ఆయా సామాజిక వ‌ర్గాల్లో మంచి ప‌ట్టుకూడా ఉంది. పైగా ఉన్న‌త‌స్థాయిలో రాజ‌కీయం చేయ‌గ‌ల నాయ‌కులు. అయితే.. వీరంతా కూడా.. తొలి రెండేళ్లు పార్టీ కోసం బాగానే ఫైట్ చేశారు.

కానీ.. రెండో ద‌ఫా.. మంత్రి వ‌ర్గ ఏర్పాటు త‌ర్వాత‌.. బెర్తులు ఆశించిన వారు.. ఎమ్మెల్సీ టికెట్లు కోరుకు న్న‌వారు.. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. వారిని అధిష్టానం ప‌క్క‌న పెట్టింద‌ని.. త‌మ‌ను ప‌ట్టించుకో లేద‌ని.. ఇలా.. వారు ఆరోప‌ణ‌లు కూడా గుప్పించారు. త‌ర్వాత‌.. వారికి ప్రాధాన్యం ఇస్తామ‌ని.. అప్ప‌ట్లో అధిష్టానం ప్ర‌క‌టించింది. ఏదోమొక్కుబ‌డిగా కొన్ని ప‌ద‌వులు పార్టీలో సృష్టించి ఇచ్చింది. అయితే.. ఆ త‌ర్వాత‌.. వాటిని వారు తీసుకున్నారో లేదో కూడా తెలియ‌దు.

అయితే.. ఒక్క‌టి మాత్రం నిజం.. వీరంతా అప్పుడో ఎప్పుడో.. అంతో ఇంతో మీడియాముందుకు వ‌చ్చి మాట్లాడిన‌కార‌ణంగా.. పార్టీకి మేలు జ‌రిగిందే త‌ప్ప‌.. మైన‌స్‌కాలేదు. అలాంటి వారిని పార్టీప‌క్క‌న పెట్ట‌డం అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఈ ప‌రిణామం..వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపిస్తుంద‌ని..

మేధావులు అంటున్నారు. ఇప్ప‌టికైనా.. చేతులు కాల‌క ముందే..పార్టీని కాపాడుకునేందుకు ఇలాంటి వారికి ఒక్కొక్క నిముష‌మైన స‌మ‌యం కేటాయించి..  వారిలో అసంతృప్తిని త‌గ్గించే ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచిస్తున్నారు.
Tags:    

Similar News