ప్రముఖ సినీ నటుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం తరచుగా వార్తల్లోకి ఎక్కుతోంది. కొద్దికాలం క్రితం వరకు బాలయ్య పీఏ కారణంగా వార్తల్లో నలిగిన హిందూపురం ఇటీవల స్థానిక సమస్యలను ఎమ్మెల్యే బాలకృష్ణ పరిష్కరించకపోవడంతో జరుగుతున్న నిరసనల కారణంగా చర్చనీయాంశంగా మారింది. గత నెలలో తాగునీటి సమస్యను పరిష్కరించని ఎమ్మెల్యే బాలయ్య తీరుకు నిరసనగా ప్రజలు రోడ్డెక్కారు. తాజాగా ఎన్నికల సమయంలో బాలయ్య హామీ ఇచ్చినట్లుగా హిందూపురంలో కూరగాయల మార్కెట్ ను నిర్మించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ ఆర్ సీపీ ధర్నాకు దిగింది.
ఈ నెల 7 నుంచి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురం నియోజకవర్గం వైఎస్ ఆర్సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ సారథ్యంలోని స్థానికులు బాలయ్య డిమాండ్ ను గుర్తుచేసేందుకు ధర్నాకు సిద్ధమయ్యారు. అయితే నిరసనను పోలీసులు ప్రాథమిక దశలోనే అణిచివేశారు. నవీన్ నిశ్చల్ ఇంటివద్ద భారీగా మోహరించిన పోలీసులు ధర్నాలో పాల్గొనేందుకు నవీన్ ను ఇంటినుంచి బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
కాగా, కొద్దికాలం క్రితం సైతం వైసీపీ, వామపక్షాలు సహా స్థానికులు తాగు నీటి సమస్యను గుర్తుచేస్తూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దున్నపోతును ఊరేగిస్తూ సమస్యలను పరిష్కరించడం లేదని తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/