కడప జిల్లాలో ఒక ప్రముఖ నియోజకవర్గంలో బీ ట్యాక్స్ పేరిట వసూళ్లు సాగుతున్నట్టుగా సమాచారం వస్తోంది. రాజకీయంగా ఒక పెద్ద కుటుంబానికి చెందిన నేత ఆ ప్రాంతంలో అరటి పళ్ల బండ్ల వాళ్లను కూడా వదలకుండా.. ఈ వసూళ్లు సాగిస్తున్నాడని తెలుస్తోంది. ఆ నేతకు నేపథ్యం పెద్దదే అయినా.. ఆయన వసూళ్లు మాత్రం చికెన్ కొట్ల వాళ్ల దగ్గర - అరటి పళ్ల బండ్ల వాళ్ల దగ్గర సాగుతున్నాయని సమాచారం. అలా చిల్లర పైసలు వసూలు చేస్తున్నారట ఆయన. దీన్ని బీ ట్యాక్స్ అంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్లు.
అందుకు సంబంధించి వీడియో ఆధారాలను కూడా తాము బయటపెడతామని వారు అంటున్నారట. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ ట్యాక్స్ లు వసూలు చేశారని వారు అంటున్నారు. ఇప్పుడు మరింత దర్జగా డిమాండ్ చేస్తున్నారని.. ఇలా ఒక నియోజకవర్గం పరిధిలో బీ ట్యాక్స్ వసూళ్లు సాగుతున్నాయని అంటున్నారు.
ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించాలని - ఈ చిల్లర దందాకు చెక్ చెప్పి.. పరువు పోకుండా చూసుకోవాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.