రూ.కోటికి కుచ్చుటోపీ పెట్టిన వైకాపా నేత‌

Update: 2015-09-04 10:41 GMT
శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైకాపా నేత దువ్వాడ శ్రీనివాస్ రూ.కోటి రూపాయ‌ల‌కు కుచ్చుటోపీ పెట్టారు. ఆసుప‌త్రి పెడ‌తామ‌ని చెప్పిన ఆయ‌న ఓ డాక్ట‌ర్ నుంచి రూ.కోటి తీసుకుని..త‌ర్వాత తిరిగి చెల్లించ‌కుండా మోసం చేసిన వైనం వెలుగులోకి వ‌చ్చింది. ఈ సంఘ‌టన వివ‌రాలు ఇలా ఉన్నాయి. టెక్క‌లికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం ప‌ట్ట‌ణానికి చెందిన ఓ డాక్ట‌ర్ నుంచి రూ.కోటి తీసుకున్నాడు. అత‌డు ఇచ్చిన చెక్కులు కూడా పలుమార్లు బౌన్స్ అయ్యాయి.

దీంతో బాధితుడు టెక్క‌లి పోలీస్‌ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌డంతో వారు శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. అయితే శ్రీనివాస్ త‌న‌కు గుండెనొప్పి వ‌స్తుంద‌ని హైడ్రామా ఆడి హాస్ప‌ట‌ల్లో చేరాడు. దువ్వాడ శ్రీనివాస్ టెక్క‌లి వైకాపా ఇన్‌చార్జ్‌ గా ఉన్నాడు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న అక్క‌డ నుంచి పోటీ చేసి కార్మిక‌శాఖా మంత్రి అచ్చెన్నాయుడు చేతిలో ఓడిపోయారు.
Tags:    

Similar News