''బక్రీద్ పండుగ అంటేనే త్యాగానికి చిహ్నం. తన కుమారుడు ఇస్మాయిల్ ను - అల్లా ఆదేశం కోసం బలి ఇవ్వడానికి - ఇబ్రహీం సిద్ధపడిన రోజు. అనుబంధాలు - ప్రేమ అన్నీ కూడా.. భగవంతుని ఆదేశం ముందు దిగదుడుపే అని ఖురాన్ సందేశం తెలిపే రోజు'' అంటూ గిద్దలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఐవి రెడ్డి పేర్కొన్నారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా.. ఆయన ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులలను ఉద్దేశించి.. పత్రికా ప్రకటనను విడుదల చేశారు. త్యాగాలకు చిహ్నమైన ఈ పవిత్రమైన పండుగ రోజున, త్యాగం తమ జీవన శైలిగా ఉన్న ముస్లిం సోదరులందరికీ నా మనస్ఫూర్వక శుభాకాంక్షలు. త్యాగాలకు గుర్తు అయిన ఈ రోజున మనం కొత్త ప్రతిజ్ఞలు చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కొత్త త్యాగాలకు సిద్ధం కావాల్సి ఉంది అంటూ ఆయన పిలుపు ఇచ్చారు.
ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం చంద్రబాబునాయుడు, అటు భాజపా మోడీ ప్రభుత్వాలు మన ప్రజలను మోసం చేస్తోంటే.. వారికి అధికారం అప్పజెప్పినందుకు మనం ఇప్పుడు కొన్ని త్యాగాలకు సిద్ధం కావాల్సిన ప్రారబ్ధం ఏర్పడినదంటూ ఐవి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రం భారీగా నష్టపోబోతోంది. దానికి తగ్గట్లుగా ప్రతికుటుంబమూ నష్టపోతుంది. అందుకే ప్రత్యేక హోదాను మంటగలిపేసి.. ప్యాకేజీ కోసం ఎగబడిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబునాయుడు కుట్రల ఫలితంగా ప్రజలు కొన్ని త్యాగాలకు సిద్ధపడాల్సి ఉంది అని ఆయన చెప్పారు.
ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహనరెడ్డి గారు పిలుపు ఇచ్చిన పోరాటానికి మనమంతా సిద్ధం కావాలని, సొంత పనులు కొన్ని త్యాగం చేసి అయినా సరే, ఉద్యమానికి దన్నుగా నిలవాలి. ప్రత్యేకహోదా సాధించేలా.. జగనన్న ను సీఎం చేయాలని ఐవిరెడ్డి చెప్పారు. అలా జరిగితే.. ఇక త్యాగాలు - కష్టాలు అవసరం లేని మంచి రోజులు మనకు వస్తాయని ఐవిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.